తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్ కు వివరించానని తెలిపారు.
నర్సంపేటలో వైఎస్‌ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. వాగ్వాదాల మధ్య చివరికి షర్మిలను తను కారులో ఉండగానే పోలీసులు క్రేన్ సహాయంతో పోలీస్టేషన్ కు తరలించారు.
ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తాంటూ వై.ఎస్ షర్మిళ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం లక్ష్మీపల్లి గ్రామంలో షర్మిల పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఆమె మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ అని కేసీఅర్ మోసం చేశారని మండిపడ్డారు. తీసుకున్న రుణాలు కట్టలేక ఉన్న పొలాలు అమ్ముకుంటున్నామన్నారు. బ్రతుకు దెరువు లేక ఇంకా బొంబాయి పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారని తెలిపారు. కేసీఅర్ ప్రభుత్వంతో మాకు ఏం మేలు…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. అధికార పార్టీపై పదునైన విమర్శలు చేస్తూ.. ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. మధ్య మధ్యలో జనాలతో మాట్లాడుతూ యాత్ర సాగుతోంది. ఇదే సమయంలో షర్మిల మరో విధంగానూ చర్చల్లోకి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేస్తారని.. ఇందుకు ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారన్నది ఆ చర్చ సారాంశం. షర్మిల పార్టీ పెట్టిన కొత్తలోనూ ఇలాంటి ప్రచారం సాగినా.. ఇప్పుడు మాత్రం మరింత…
ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం ఖానాపురం గ్రామాల్లో 89 వ రోజు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్రకు స్థానిక ప్రజలు వైఎస్సార్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పాదయాత్రలో గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. గ్రామంలోని ప్రజలు రైతుల కోరిక మేరకు షర్మిల తలపాగా చుట్టి రైతు అవతారంలో ట్రాక్టర్ నడిపి వైఎస్సార్ అభిమానులను రైతులను ఆనందపరిచారు. గన్నవరం నుంచి ఖానాపూర్ వరకు ట్రాక్టర్ నడిపారు.…
కేంద్ర మంత్రి అమిత్ షాపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. అమిత్ షా గారి మాటలకు ఊదు కాలదు.. పీరు లేవదని షర్మిల ఎద్దేవ చేశారు. అవినీతి చేస్తున్నారని తెలిసికూడా మీ పాతమిత్రుడు KCR ని అరెస్ట్ చెయ్యరు! ఎందుకని ఆమె నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకంలో వాటా ఉందన్న మీరు.. KCR అవినీతిలో మీకువాటాలేదంటే మేము నమ్మాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏండ్లుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిచ్చారని,…
ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు షర్మిల. పాదయాత్రలో 21వ రోజున ఆగిపోయిన గ్రామం నుంచే 22వ రోజు పాదయాత్ర తిరిగి మొదలు కానుంది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల పాదయాత్రకు బయలు దేరుతారు. మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం గ్రామానికి చేరుకుని… స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం…