రేపు సంగారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యంను పరిశీలించనున్నారు. ఆ తరువాత అక్కడున్న రైతుల సమస్యల గురించి అడిగి తెలుకుంటారు. తెలంగాణలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేయబోతున్న షర్మిల, పార్టీకి సంబందించిన జెండా, అజెండాను జులై 8 వ తేదీన ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈలోగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలపై పోరాటం చేసేందుకు వైఎస్ షర్మిల సిద్దం అవుతున్నారు. ఇందులో…
వైఎస్ షర్మిల కొత్తపార్టీని ఇప్పటికే ప్రకటించింది. కొత్త వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని పెట్టబోతున్నారు. కాగా ఈరోజు షర్మిల కొత్త పార్టీ గురించి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. కేసులకు భయపడి ఈటల రాజెందర్ బీజేపీలో చేరుతున్నారనీ, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారిపై కేసులు పెట్టడం కామన్ అయిందని అన్నారు. ఈటల తమ పార్టీలోకి వస్తామంటే తప్పకుండా ఆహ్వనిస్తామని, ఇప్పటి వరకు ఈటలతో ఈ విషయంపై చర్చించలేదని అన్నారు.…
ఏప్రిల్ 9 వ తేదీన షర్మిల కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్కోన్న సంగతి తెలిసిందే. పార్టీని ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులతో చర్చించారు. నాయకుల, వైఎస్ఆర్ అభిమానుల సలహాలు సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. జూన్ నెలలో పార్టీ పేరు, అజెండాను ప్రకటిస్తామని వైఎస్ షర్మిలా పేర్కోన్న సంగతి తెలిసిందే. ఇక, ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల రేపు గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉద్యోగాలు లేక…
తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీగా వాక్సినేషన్ ఇస్తామని నిన్న సీఎం కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై షర్మిల సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. “చావు భయంతో చస్తున్న ప్రజలను అప్పులపాలు చెయ్యడం అమానుషం. ప్రజల మాట, మా మాట విని అందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు KCR గారికి ధన్యవాదాలు. ఇప్పుడైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చచ్చి బతికిన వారిని ఆదుకోవాలని…
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు. అయితే, సాయంత్రం తరువాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు. ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మూడు రోజులపాటు దీక్ష చేస్తున్నట్టు ఏప్రిల్ 9 వ తేదీన…