నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ పదవులను ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు ఎస్సీలను అవమానించారని, ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని అన్నారని పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ముందు “మోడీ,మోడీ” నినాదాలు.. “ఫ్లయింగ్ కిస్”తో సమాధానం..
విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దానిని కూడా తట్టుకోలేకపోతున్నారని నారాయణ స్వామి తెలిపారు. వైయస్ కుటుంబాన్ని కూడా చీల్చారు.. వైయస్ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఒకవైపు చంద్రబాబు, నయవంచకులు ఉన్నారు.. చివరకు ఆయన చెల్లెల్ని కూడా పంపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో చేరి జగనన్నపై యుద్ధం చేస్తామని షర్మిల అంటున్నారన్నారు.
Read Also: YS Sharmila: నేను ఎవరు వదిలిన బాణం కాదు.. సజ్జలకు షర్మిల కౌంటర్
రాజశేఖర్ రెడ్డి ఆశయంతో అయితే అభివృద్ధి గురించి ఆలోచించాలని నారాయణ స్వామి అన్నారు. తప్పు చేయని జగన్ ను కాంగ్రెస్ నేతలు 16 నెలలు జైల్లో పెట్టారు.. ఇవన్నీ గుర్తు లేవా అని ప్రశ్నించారు. షర్మిల జగన్ విడిచిన బాణమా.. సోనియా గాంధీ వదిలిన బాణమా.. అని అన్నారు. షర్మిల వల్ల విజయమ్మ కూడా మదనపడుతోందని తెలిపారు. కాగా.. ఎలాంటి వారు వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు జరిగి ఉంటేనే ఓటు వేయమని ధైర్యంగా జగన్ అడుగుతున్నారని నారాయణ స్వామి పేర్కొన్నారు.