దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన రోడ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం మీద ఆయన ఆరా తీసుకున్నారు.
బెంగళూరు దేశంలోనే టెక్ సిటీగా పేరుగాంచింది. బెంగళూరు సిటీ అంటే సుందరవనానికి మారుపేరు. అలాంటి నగరం ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. నగర రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి.
రోడ్లు వేయకుండా అడ్డుకుంటే ఊరుకోబోమని సర్పంచ్‌లను హెచ్చరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈరోజు పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
గుజరాత్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. వడోదరలో 13.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం భారీ వరదలతో ముంచెత్తింది. మరోవైపు.. విశ్వామిత్ర నది ప్రమాదకర స్థాయిని దాటింది. విశ్వామిత్ర నది నీటిమట్టం పెరగడంతో మొసళ్లు బయటకు వస్తున్నాయి. ఎగువ నది నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా విశ్వామిత్ర నదికి వరద పోటెత్తింది. నది మట్టం ప్రమాద స్థాయిని దాటి 27.85 అడుగులకు చేరుకుంది.
తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నామని, సుస్థిర పాలన అందిస్తున్నామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్‌పై చర్చ జరుగుతుంది కానీ ముందుకు కదలడం లేదన్నారు.