Minister Gummadi Sandhya Rani:రోడ్లు వేయకుండా అడ్డుకుంటే ఊరుకోబోమని సర్పంచ్‌లను హెచ్చరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈరోజు పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మక్కువ మండలం కాశీపట్నం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మక్కువ మండలంలో 11 బీటీ రోడ్లుకి ఒక్క రోడ్డు మాత్రమే చేశారు.. మిగతా 10 రోడ్లు చేయనివ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.. మక్కువ మండలంలోని 21 పంచాయితీల్లో వైసీపీకి 20 మంది సర్పంచ్‌లు ఉన్నారు.. 19 ఎంపీటీసీలు వున్నారని గుర్తుచేసిన ఆమె.. అధికార కూటమి పార్టీకి ఒక్క సర్పంచ్, 2 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. ఇదే అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు.. గ్రామాల్లో అభివృద్ధి అడ్డుకుంటే వదిలేదిలేదని వార్నింగ్ ఇచ్చారు.. మాకు సహకరించండి.. లేకుంటే నేనే దగ్గరుండి రోడ్లు వేయేస్తాను అన్నారు మంత్రి సంధ్యారాణి..
Read Also: Chandrababu: కుప్పాన్ని ఐదేళ్లలో ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తా
మంత్రిగా నా నియోజవర్గాన్ని అభివృద్ధి చేయడకం నా కర్తవ్యం. దానిని అడ్డుకుంటే సహించేది లేదు అంటూ హెచ్చరించారు.. మంత్రి సంధ్యారాణి.. మరోవైపు.. మక్కువ మండలం కాసిపేట దగ్గర ఉన్న కేజీబీవీ ఆకస్మితంగా తనిఖీ చేశారు మంత్రి. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు.. చదువులు, భోజనం, వసతి గురించి ఆరా తీశారు. భోజనశాలకు వెళ్లి పరిశీలించగా కోడిగుడ్లు చిన్నగా ఉండడాన్ని గమనించి వసతి అధికారిని అడుగ్గా , కోడిగుడ్లు సప్లై చేసే ఏజెన్సీ చిన్న సైజు సప్లై చేస్తున్నారని మంత్రి కి బదులిచ్చారు.. ఇలాగైతే ఏజెన్సీని మార్చే అవకాశం ఉందని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి.