CM Revanth Reddy : భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం మీద ఆయన ఆరా తీసుకున్నారు. సీఎం అధికారులు తక్షణమే కేంద్రానికి వివరాలు అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని చెరువుల పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం పేర్కొన్నారు. పంటలకు వచ్చిన నష్టం అంచనా వేయించి, తక్షణమే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వరదల సమయంలో గల నైపుణ్యాలను మరింత పెంపొందించాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ తో పని లేకున్నా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు.
Lokesh Kanagaraj : అతను లేకుంటే సినిమాలు చేయను.. లోకేష్ సంచలన ప్రకటన
రాష్ట్రంలో 1052 చోట్ల 1023 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. రోడ్ల డ్యామేజ్ పై సమగ్ర నివేదిక తయారు చేయాలని, హెచ్ఎం డీ ఏ పరిధిలో చెరువుల నోటిపై వెంటనే పరిశీలనలు జరగాలని సీఎంఆర్ ఆదేశించారు. వరదలలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం, చనిపోయిన జంతువులకూ పరిహారం అందించాలి. కలెక్టర్లు, ఎస్పీలు జిల్లా స్థాయిలో ఉండి, కిందస్థాయి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పై సమగ్ర నివేదిక తయారు చేసి కేంద్రానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు.
Rinku Singh: ఒక్క మ్యాచ్‌లో 27 సిక్సర్లు.. రింకు సింగ్ వీరవిహారం..