వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. వాహనదారులకు రోడ్లు నరకపాయంగా మారిపోయాయి.. ఏపీ ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో విమర్శలు కూడా వెల్లువిత్తాయి.. ఈ నేపథ్యంలో రోడ్లు బాగు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, శంకర్‌నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి.. సంబంధిత అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్టోబర్ మాసానికల్లా వర్షాలు…
ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత రాజధాని ప్రాంతంలో రోడ్లు వేశారు. అయితే, ఇప్పుడు ఆ రోడ్లు ఉన్నట్టుండి మాయం అవుతున్నాయి. వేసిన రోడ్లను దొంగతనం చేస్తున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజమని స్థానికులు చెబుతున్నారు. రాత్రిసమయంలో కొంతమంది రోడ్లను తవ్వుకొని ఎత్తుకుపోతున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇదంతా అధికారపార్టీకి చెందిన వ్యక్తులే చేస్తున్నారని, రాజధానిగా అమరావతి ఉండటం వారికి ఇష్టంలేదని అందుకే అలా చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ఇది తమపని…
ఢిల్లీలో కేసులు కనిష్టస్థాయికి చేరుకోవడంతో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించారు. నిన్నటి నుంచి అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా దుకాణాలు… వ్యాపార సముదాయాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఢల్లీలో మాములు సమయంలో నిత్యం రద్ధీగా కనిపించే కానాట్‌ప్లేస్, కరోల్‌భాగ్ ఏరియాల్లో చిన్న వ్యపారాల నుంచి వ్యాపారసముదాయాల వరకు అన్ని తెరుచుకున్నాయి. కానీ, కరోనా భయంతో ప్రజలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మాల్స్ వెలవెలబోయాయి. అటు రోడ్లు సైతం బోసిపోయి కనిపించాయి. కరోనా భయం…