వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్… మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్‌ను మీడియాకు వెల్లడించిన ఆయన.. రెపో, రివర్స్ రెపో రేట్లు యధాతథంగా ఉంటాయని ప్రకటించారు.. రెపో రేటును 4 శాతం వద్దే ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిందని.. రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచామని ఈ సందర్భంగా తెలిపారు శక్తికాంత్ దాస్.. అయితే, ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి.. కరోనా సృష్టించిన పరిస్థితుల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని.. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపుతో వాటి డిమాండ్ పెరుగుతుందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్.
Read Also: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. పేరుకుపోయిన కోవిడ్ టీకాలు..!
ఒమిక్రాన్ భయాందోళనలు నెలకొన్న తరుణంలో వరుసగా 9వ సారి కూడా రుణ రేట్లను మార్చలేదు ఆర్బీఐ.. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండేలా చూసుకుంటూ వృద్ధిని పెంచేందుకు అవసరమైనంత కాలం రేట్లను కొనసాగించేందుకు మరియు అనుకూలమైన వైఖరిని కొనసాగించేందుకు MPC ఏకగ్రీవంగా ఓటు వేసిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్థిక రంగంలో, ఆర్బీఐ 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి లక్ష్యాన్ని 9.5 శాతం వద్ద నిలుపుకుందని వెల్లడించారు.. FY22కి రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా అంచనా వేయబడింది. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో 4 శాతంగా ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆర్బీఐని కోరింది.