ఈరోజుల్లో అన్నీ ఆన్ లైన్ చెల్లింపులే జరుగుతున్నాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తుంటాం. అయితే, జనవరి1, 2022 నుంచి కొన్ని నిబంధనలు మారబోతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారు వీటిని తెలుసుకోవడం తప్పనిసరి. జనవరి 1, 2022 నుండి బ్యాంక్ ఖాతాదారులు తమ కార్డ్ నంబర్, గడువు తేదీ మొదలైన వాటి వివరాలను గూగుల్ సేవ్ చేయదు. అటువంటి పరిస్థితిలో, జనవరి 1 నుండి మాన్యువల్ ఆన్‌లైన్ చెల్లింపు చేస్తున్నప్పుడు, మీరు మాన్యువల్‌గా మీ కార్డ్ నంబర్, గడువు తేదీ, ఇతర సమాచారం తెలపాలి.
చెల్లింపులు చేస్తున్నప్పుడు ఈ సమాచారాన్ని మీ దగ్గర ఉంచుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. ఇప్పటివరకూ ఏదైనా కస్టమర్ ఆన్ లైన్ చెల్లింపులు చేసేటప్పుడు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సీవీవీ నంబర్‌ను మాత్రమే నమోదు చేసేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం మొత్తం సమాచారం ఇవ్వాల్సిందే.
గతంలో గూగుల్ సేవ్ చేసిన డేటా భద్రత పరంగా ప్రమాదకరంగా మారిందని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కార్డు సున్నితమైన సమాచారాన్ని ముందుగానే సేవ్ చేయవద్దని ఆయా కార్డు కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. RBI యొక్క కొత్త మార్గదర్శకాలు google Play Store, YouTube మరియు google ప్రకటనల వంటి అన్ని చెల్లింపు సేవలకు వర్తిస్తాయి. కొత్త ఫార్మాట్ ప్రకారం, మీరు 1 జనవరి 2022 నుండి అన్ని ఆన్‌లైన్ మాన్యువల్ చెల్లింపుల కోసం ప్రతిసారీ మీ కార్డ్ సమాచారాన్ని నమోదు చేయాలి. అంటే మీ సమాచారం మీదగ్గర వుంచుకోవాలి. కార్డు వ్యాలిడిటీ, సీవీవీ మీరు ఖచ్చితంగా తెలుసుకుని వుండాలి.