అలర్ట్: ఈ నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకుల మూత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ లావాదేవీలు పెరిగిన తర్వాత బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పట్టినా.. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంటారు.. కానీ, వారు అలర్ట్ కావాల్సిన సమయం ఇది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.. అంటే ఒకే నెలలో 21 రోజుల పాటు బ్యాంకు లావాదేవీలు జరగవు అన్నమాట.. ఆ 21 రోజుల్లో 14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మరో ఏడు రోజులు వీకెండ్ హాలిడేస్ వచ్చాయి. ఇక, వాటిలో.. ఆయా రాష్ట్రాలను బట్టి అవి మారిపోయే అవకాశం కూడా ఉన్నాయి..
ఈ నెలలో బ్యాంకుల సెలవులకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అక్టోబరు 1వ తేదీ అర్ధ సంవత్సర క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్.. ఇది కేవలం గ్యాంగ్‌టక్‌కే పరిమితం కాగా.. అక్టోబరు 2 గాంధీ జయంతి, 3న ఆదివారం, 6న మహాలయ అమావాస్య, 7న మేరా చౌరెన్ హుబ ఆఫ్ లైనింగ్‌తో సనామహి, 9న రెండో శనివారం, 10న ఆదివారం, 12న దుర్గా పూజ, 13న మహాష్టమి, 14న దుర్గా పూజ , 15న దసరా, 16న దుర్గా పూజ, 17న ఆదివారం, 18న కటి బిహు, 19న ఈద్ ఇ మిలాద్, 20న మహర్షి వాల్మికి పుట్టిన రోజు, 22న ఈద్ ఇ మిలాద్, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం, 26న అసెషన్ డే, 31న ఆదివారం ఇలా.. మొత్తంగా ఈ నెలలో 21 రోజులు సెలవులు వచ్చాయి. అయితే, ఈ 21 సెలవులు అన్ని రాష్ట్రాలకు ఏం వర్తించవు.. ఆయా సందర్భాలను బట్టి కొన్ని రాష్ట్రాలకే పరిమితం కానున్నాయి.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!