Rs. 2000 note withdrawal: మే 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు గడువు ఇచ్చింది.
RBI : అన్ని బ్యాంకులకు పెద్ద రిజర్వు బ్యాంక్. ఈ బ్యాంక్ నియమ నిబంధనలను పాటించే మిగతా బ్యాంకులన్నీ పని చేయాలి. లేదంటే రిజర్వ్ బ్యాంకు ఆయా బ్యాంకులపై చర్యలను తీసుకుంటుంది. అలాగే కొన్ని ఆదేశాలను పాటించనందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌పై 2.5 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది.
ఆర్బీఐ బ్యాంక్ లాకర్ నిబంధనలను మార్చింది. బ్యాంక్ లాకర్ సవరించిన ఒప్పందంపై ఖాతాదారులతో సంతకం చేయడానికి దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తమ లాకర్ల ఛార్జీలలో మార్పులు చేశాయి.
Rs.2000 Note Withdrawal: రూ.2000 నోటు ఉపసంహరణ నిర్ణయం, దానికి వస్తున్న ఇప్పటి వరకు వచ్చిన ప్రతిస్పందన చూస్తే 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని మరింతగా పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఆర్బీఐ అంచనా వేసిన 6.5 శాతం వృద్ధిని మించి పెరిగేందుకు సహాయపడుతుందని ఒక నివేదిక తెలిపింది.
Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్ భారతదేశంలోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC). ఇది బంగారు రుణాలను అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుండి గట్టి చర్యను ఎదుర్కొంది.
ప్రధానంగా ఆహార ధరల తగ్గుదల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి పడిపోయింది. రీటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల ఆర్థికవేత్తలు అంచనా వేసిన దానికి అనుగుణంగానే ఉంది.
RBI: రుణం ఇవ్వడానికి బ్యాంకులు మీ నుండి కొన్ని పత్రాలను డిమాండ్ చేయడం తరచుగా చూసే ఉంటాం. రుణం పూర్తిగా చెల్లించే వరకు బ్యాంకులు ఈ పత్రాలను తమ వద్ద ఉంచుకుంటాయి.
Fixed Deposit Rates: RBI వరుసగా ఆరు సార్లు రెపో రేటును పెంచిన తర్వాత, అన్ని బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను పెంచాయి. ప్రస్తుతం, గురువారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను RBI స్థిరంగా ఉంచింది.
బెంచ్మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. రెపో రేటు మారకపోవడంతో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్ రేటు) 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు.