Rs.2000 Notes Withdrawal: రూ.2000 నోట్ల ఉపసంహరణపై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2,000 Notes Withdrawal: రూ. 2,000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మే 30న దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై పిటిషనర్, ఆర్బీఐ తరుపున న్యాయవాదుల వాదనలను న్యాయమూర్తి సతీస్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం వింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.
Read Also: Telangana Jana Garjana: కాంగ్రెస్ వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్: రాహుల్
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
రూ. 2000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకునే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేదని, ఈ విషయంలో కేంద్రం మాత్రమే నిర్ణయం తీసుకోగలదని పిటిషనర్ రజనీష్ భాస్కర్ గుప్తా తన పిల్ లో పేర్కొన్నాడు. ఏదైనా డినామినేషన్ నోట్లను జారీ చేయకుండా నిలిపివేసే స్వతంత్ర అధికారం ఆర్బీఐకి లేదని, 1934 ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 24 (2) ప్రకారం కేంద్రానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అయితే ఆర్బీఐ మాత్రం కరెన్సీ నిర్వహణ, ఆర్థిక విధానానికి సంబంధించిన అంశం అని తెలిపింది.
మే 19న ఆర్బీఐ రూ. 2,000 నోట్ల చలామణిని ఉపసంహరించుకుంది. సెప్టెంబర్ 30 వరకు నోట్లను మార్చుకునేందుకు సమయం ఇచ్చింది. అన్ని బ్యాంకుల్లో ఈ గడువులోగా నోట్లను మార్పిడి చేసుకోవచ్చని, అకౌంట్లలో జమచేయవచ్చని తెలిపింది. ఒకసారి రూ. 20,000 వరకు రూ.2000 నోట్లను మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఖాతాల్లో డిపాజిట్ పై ఎలాంటి పరిమితి విధించలేదు.
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!