RBI: రూ.2000 నోట్లలో.. 76 శాతం బ్యాంకులకు చేరాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రూ.2000 నోట్ల (Rs 2000 notes)ను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్న ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడంతో ఆ నోట్లన్నీ బ్యాంకులకు చేరుకుంటున్నాయి. తాజా లెక్కల ప్రకారం.. మే 19 నుంచి 76 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని. కాగా 87 శాతం నోట్లను మార్చారని ఆర్‌బీఐ సోమవారం వెల్లడించింది. ఇందులో అత్యధిక శాతం డిపాజిట్ల రూపంలో వచ్చినవే అని పేర్కొంది.
CM YS Jagan: ఈ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా టెన్త్ చదవాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
‘‘బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. మే 19 తర్వాత నుంచి జూన్ 30వ తేదీ వరకు రూ.2.76లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు (Rs 2000 notes) మళ్లీ బ్యాంకులకు చేరుకున్నాయి. మొత్తం చలామణీలో ఉన్న నోట్లలో ఇది 76శాతం. ఇక, రూ. 84 వేల కోట్ల విలువైన నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయి’’ అని ఆర్‌బీఐ (RBI) ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. బ్యాంకులకు చేరుకున్న రూ.2వేల నోట్లలో దాదాపు 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మిగతా 13 శాతం నోట్లను ప్రజలు మార్చుకున్నట్లు పేర్కొంది. మరోవైపు చివరి నిమిషం వరకు వేచి ఉండవద్దని ఆర్‌బీఐ ప్రజలకు నిరంతరం విజ్ఞప్తి చేస్తోంది.
Potato Fingers : పొటాటో ఫింగర్స్ ను ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?
మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19న ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు విధించింది. 2016లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ.2వేల నోట్లను కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
- Tags
- 2000
- bandk
- notes
- RBI
- telugu news
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!