How Many Bank Accounts Should One Man Have: ప్రస్తుత రోజుల్లో ‘బ్యాంకు అకౌంట్’ ప్రతి ఒక్కరికి అవసరం అయింది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం మారినప్పుడు, వేరువేరు ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పుడు, వ్యాపారం కోసం లాంటి సందర్భాలలో కొత్తగా బ్యాంకు ఖాతాలు తీయాల్సి వస్తుంది. అప్పుడు ఓ వ్యక్తికి ఒకటికి మించి ఎక్కువ అకౌంట్లు ఉంటాయి. అయితే ఇలా బ్యాంకు అకౌంట్స్ తీయాల్సి వచ్చినప్పుడు.. ఓ వ్యక్తి గరిష్ఠంగా ఎన్ని బ్యాంక్ అకౌంట్లు తెరవగలడు అనే ప్రశ్న అందరిలో ఉంటుంది. ఆ వివరాలు ఓసారి చూద్దాం.
భారతదేశంలో బ్యాంకు అకౌంట్ తెరవడానికి ఎలాంటి పరిమితి లేదు. ఓ వ్యక్తి ఒకటికి మించి ఖాతాలు తెరవొచ్చు. బ్యాంకు అకౌంట్ సంఖ్యపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎలాంటి పరిమితిని విధించలేదు. దాంతో ఓ వ్యక్తి కావాల్సినన్ని బ్యాంక్ అకౌంట్లు తెరవవచ్చు. మీ సౌలభ్యం ప్రకారం.. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, సాలరీ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్లను మీరు హాయిగా తెరవవచ్చు. అయితే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్స్ కలిగి ఉన్న వారు అన్ని ఖాతాల్లో లావాదేవీలను నిత్యం నిర్వహిస్తుండాలి. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది.
ప్రస్తుతం అన్ని బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ మినహా.. సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వను (మినిమమ్ బ్యాలెన్స్) ఉంచడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలో ఎల్లప్పుడూ మినిమమ్ బ్యాలెన్స్ మెయిటైన్ చేయాలి. ఆయా బ్యాంక్స్ రూల్స్ ప్రకారం మీ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ లేకుంటే.. పెనాల్టీ విధిస్తుంది. దీంతో మీరు డబ్బు నష్టపోవాల్సి వస్తుంది.
ఓ వ్యక్తి ఒకటికి మించి ఎక్కువ ఖాతాలు ఉన్న సందర్బాలలో బ్యాంకులే లాభపడతాయి. ప్రతి బ్యాంకు మెసేజ్‌లు పంపడానికి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ నిర్వహణకు కూడా మీరు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవారు మీరు వార్షిక రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అవసరం లేని ఖాతాలను మూసివేయడం మంచిది.
Also Read: Vande Bharat Express: 183 శాతం ఆక్యుపెన్సీతో ఆదరణలో అగ్రస్థానంలో కాసర్‌గోడ్ వందేభారత్