Rs.2000 Note Withdrawal: రూ.2000 నోటు ఉపసంహరణ నిర్ణయం, దానికి వస్తున్న ఇప్పటి వరకు వచ్చిన ప్రతిస్పందన చూస్తే 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని మరింతగా పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఆర్బీఐ అంచనా వేసిన 6.5 శాతం వృద్ధిని మించి పెరిగేందుకు సహాయపడుతుందని ఒక నివేదిక తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికి వాస్తవికి జీడీపీ వృద్ధి 8.1 శాతానికి చేరొచ్చని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ వెల్లడించినట్లు 85 శాతం నోట్లు డిపాజిట్ రూపంలో బ్యాంకులకు చేరాయని, 15 శాతం నోట్లు బ్యాంక్‌ల వద్ద మార్చుకోవచ్చని ఎస్‌బీఐ చెప్పింది.
ఈ గణాంకాల ప్రకారం.. రూ.55,000 కోట్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సుమారు రూ. 3.08 లక్షల కోట్లు డిపాజిట్ల రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి రానున్నాయని, ఇందులో రూ. 92,000 కోట్లు పొదుపు రూపంలో బ్యాంకు ఖాతాల్లోకి చేరాయని ఎస్‌బీఐ తెలిపింది. ఇందులో 60 శాతం నిధుల్ని ఉపసంహరించుకునే అవకాశం ఉండటంతో రూ. 55,000 కోట్ల వినియోగం వెనువెంటనే పెరుగొచ్చని తెలిపింది. దీర్ఘకాలంలో ఇది రూ.1.83 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది. రూ.2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం ద్వారా వినియోగ గిరాకీ పెరగడం ప్రధాన ప్రయోజనమని ఎస్‌బీఐ తెలిపింది.
Read Also: Upasana-Ram Charan: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన..మెగా ఇంట సంబరాలు..
అధిక విలువ మొత్తాలు బంగారం, ఆభరణాలు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి హై-ఎండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటివాటిపై ఎక్కువగా ఖర్చు చేయొచ్చని అంచనా వేసింది. ఇంధన చెల్లింపులు, క్యాష్ ఆన్ డెలివరీల పెరుగుతుందని తెలిపింది. జొమాటో వంటి ఫుడ్ డెలివరీల్లో మూడో వంతు వినియోగదారులు రూ. 2000 నోట్లతో నగదు చెల్లింపుల చేయడాన్ని ఉదహరించింది.
దేవాలయాలు, ఇతర మత సంస్థలకు రూ.2000 నోట్ల ద్వారా విరాళాలను పెంచుతుందని, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు బోటిక్ ఫర్నిచర్ వంటి అనేక రకాల కొనుగోళ్లను పెంచుతుందని భావిస్తున్నారు. ఆర్బీఐ రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)కి కూడా రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రయోజనం కలిగిస్తుంది, అధిక విలువ కలిగిన నోట్లు లేకపోతే మర్చంట్ లావాదేవీలకు ఈ రూపీ వినియోగం పెరుగుతుందని నివేదిక తెలిపింది.