రాజస్థాన్‌లో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయేది. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన జుంజును జిల్లాలో చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కోటా నగరంలోని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా భార్య తన భర్తపై కత్తితో దాడి చేసింది. కడుపులో బలమైన గాయం కావడంతో భర్త రక్తపు మడుగులో పడ్డాడు. అతన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. వీరిద్దరికీ 10 నెలల క్రితమే వివాహమైంది. యువకుడి కుటుంబ సభ్యులు యువతిపై, ఆమె తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Student Cheated: దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఘటనలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దింతో ప్రజలు సంవత్సరాల తరబడి సంపాదించిన డబ్బును నిమిషాలల్లో కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో రాజస్థాన్‌లో కూడా సైబర్ ముఠాలు చాలా యాక్టివ్‌గా మారాయి. భరత్పూర్ జిల్లాలోని డీగ్ నగరం ఈ నేరాలకి చాలా ప్రసిద్ధి చెందింది. అయితే, ఇప్పుడు దుండగులు ఇతర జిల్లాల్లో కూడా విస్తరిస్తున్నారు. తాజాగా అజ్మీర్ జిల్లాలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి దాదాపు 200 మందిపై సైబర్ మోసానికి…
Tonk Violence: రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా సమ్రావత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన హింసాకాండతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు బృందాలు గస్తీ తిరుగుతున్నాయి. బుధ్రావ్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేష్ మీనా మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నరేష్ మీనా మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారని, అగ్నిప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీంతో స్పందించిన పోలీసులు బాష్పవాయువు షెల్స్‌ను విడుదల చేసి దాదాపు 100 రౌండ్లు…
రాజస్థాన్‌లో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే సైకిళ్ల రంగును మార్చిన భజన్‌లాల్ ప్రభుత్వం కళాశాలలకు కాషాయ రంగు వేయడానికి సిద్ధమవుతోంది. మొదటి దశలో రాష్ట్రంలోని ప్రతి డివిజన్లోని రెండు కళాశాలల ముఖద్వారాలు, హాళ్లకు కాషాయం రంగులు వేయని నిర్ణయించింది. దీని తర్వాత రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల రంగు మారనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొదటి దశలో 10 డివిజన్లలోని 20 కళాశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి.
Crime: రాజస్థాన్‌లో రెండు రోజలు క్రితం అదృశ్యమైన 50 ఏళ్ల బ్యూటీషియన్ శరీర భాగాలు ఒక ప్లాస్టిక్ బ్యాగులో కనిపించాయి. మహిళను ఆమెకు తెలిసిన వ్యక్తి హత్య చేసి, ఆమె శరీర భాగాలను ఆరు ముక్కలు చేసిన నిందితుడు, ఇంటి సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 28న బాధితురాలు అనితా చౌదరి మధ్యాహ్నం తన బ్యూటీ పార్లర్ మూసేసిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆమె భర్త మన్మోహన్ చౌదరి జోధ్‌పైర్ పోలీస్…
రాజస్థాన్‌లోని సికార్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కల్వర్టును బస్సు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టికెట్ తీసుకోనందుకు హర్యానాకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్ జారీ చేశారు. దీంతో హర్యానా, రాజస్థాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ కారణంగా.. హర్యానా పోలీసులు రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులకు చలాన్లు జారీ చేయగా.. ఆదివారం రాజస్థాన్‌లో హర్యానా రోడ్‌వేస్ బస్సులకు 26 చలాన్లు జారీ చేయబడ్డాయి.
BJP Candidate List: ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు బీజేపీ నేడు (గురువారం) తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ లో కుందార్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ నుంచి సంజీవ్ శర్మ, ఖైర్ నుంచి సురేంద్ర దిలర్, కర్హల్ నుంచి అనుజేష్ యాదవ్, ఫుల్పూర్ నుంచి దీపక్ పటేల్, కటేహరి…
Accident: రాజస్థాన్‌లోని ధోల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. బారీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 11Bలోని సునిపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ బారీ నగరంలోని గుమత్ మొహల్లా నివాసితులు.…