స్కూల్ చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, జీవితంలో అత్యుత్తమ పునాది పాఠశాలలో వేయబడుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి బడిలో చదివించాలని కష్టపడుతున్నారు.. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు జీవితం గురించి కూడా బోధిస్తారు. అన్ని రంగాల్లో రాణించగలమన్న సత్తాను చాటుతున్నారు... ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్యనభ్యసిస్తున్నారనే నమ్మకం ఉంది..
రాచకొండ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి మూడు తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా గుర్తించారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాదులో తుపాకులు విక్రయించేందుకు ఈ ముఠా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా? అని ఆరా తీస్తున్నారు. ముఠా…
Heavy Snowfall: దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కమ్మేసింది. దీంతో ఈ రోజు (జనవరి 10) ఉదయం ఢిల్లీలో పొగమంచు ఆవరించడంతో దృశ్యమానతను సున్నాకి పడిపోయింది. దీని ప్రభావంతో సుమారు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Saraswati River: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్ ప్రాంతంలో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఏకంగా భూమి నుంచి భారీగా నీరు బయటకు వచ్చింది. ఏకంగా ఈ నీటిలో ఓ జలాశయమే ఏర్పడింది. ఎడారి ప్రాంతంలో భూగర్భం నుంచి ఇంత స్థాయిలో నీరు బయటకు రావడం ఇప్పడు వైరల్‌గా మారింది.
Borewell Incident: రాజస్థాన్లో బోరు బావి ఘటనలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడాలని యావత్ దేశం కోరుకుంటోంది. అయితే, గత 6 రోజులుగా బాలిక బావిలోనే ఉంది. చిన్నారిని రక్షించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. 700 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో ఆడుకుంటూ బాలిక అందులో పడిపోయింది. 150 అడుగుల లోతులో చిన్నారి చేత్నా చిక్కుకుంది. రాజస్థాన్ కోట్పుట్లీలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న 44 ఏళ్ల సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య చిన్నా..పెద్ద తేడా లేకుండా కళ్ల ముందే కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరుచుగా జరుగుతున్నాయి.
రాజస్థాన్‌లోని కోట్పుత్లీలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మూడేళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. బోరుబావి 700 అడుగుల లోతు ఉంది. మొదట్లో దాదాపు 15 అడుగుల లోతులో ఉన్న బాలిక ఒక్కసారిగా జారి కిందకు వెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భూపేంద్ర చౌదరి కుమార్తె చేతనా చౌదరి ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో.. ప్రమాదవశాత్తు కాలు జారి తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
భూమ్మీద నూకలుంటే.. ఎంత ప్రమాదమైనా బయటపడతారని అప్పుడప్పుడూ పెద్దలు అంటుంటారు. చాలా మంది చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. ఒకవేళ చూడకపోతే.. తాజాగా జరిగిన ఓ కారు ప్రమాదం మాత్రం అక్షరాల నిజమని చెబుతుంది.