Women Kidnap On Road: రాజస్థాన్ లోని బలోత్రాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. శుక్రవారం సాయంత్రం పచ్చపద్ర రోడ్డులోని పృథ్వీరాజ్ ధర్మకాంత సమీపంలో ఓ మహిళను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో నుంచి బలవంతంగా లాగి తమ కారులో ఎక్కించుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్నవారు కెమెరాలో రికార్డ్ చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపక్కన స్కార్పియో కారు ఆగడం, అందులో నుంచి కొందరు వ్యక్తులు వచ్చి ఆటోలో కూర్చున్న మహిళ వద్దకు వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత వారు మహిళను బలవంతంగా ఆటోలోనుంచి లాగి కారులోకి ఎక్కించారు. మహిళ గట్టిగా అరుస్తున్న పట్టించుకోకుండా నిందితులు ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఆ కారు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా సంచలనం రేపింది. ఈ ఘటనను ఖండిస్తున్న స్థానికులు నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
Also Read: BSNL Recharge Plan: బంపర్ ఆఫర్.. కేవలం రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ
ఇకపోతే, ఈ వ్యవహారం అంతా ప్రేమ వ్యవహారానికి సంబంధించిందని సమాచారం. మహిళా అపహరణ తర్వాత కుల్దీప్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ కు చేరుకుని కేసు నమోదు చేశాడు. శివానా నివాసి అయిన మంజును ప్రేమ వ్యవహారం తర్వాత వివాహం చేసుకున్నానని కుల్దీప్ చెప్పాడు. బాలిక కుటుంబ సభ్యులు వారి వివాహానికి అనుకూలంగా లేకపోవడంతో.. ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇద్దరికీ పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. గత శుక్రవారం కుల్దీప్ తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్తున్నాడు. ఈ సమయంలో కొంతమంది దుండగులు తమ కారును ఆటతో ముందు ఆపి అతని భార్యను తీసుకెళ్లారు. ఈ సమయంలో యువకుడిని, అతని కుటుంబ సభ్యులను కూడా దుండగులు కొట్టారని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Also Read: Helicopter For Bride: వధువును ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసిన వరుడు
నవంబర్ 11న కుల్దీప్ మంజుతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో.. ఆ యువకుడు బాలిక హైకోర్టు నుంచి రక్షణ పొందారు. అయితే, ఘటన జరిగిన సమయంలో భద్రతా సిబ్బంది ఎవరూ అక్కడ లేరు. దీనిని సద్వినియోగం చేసుకుని దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే బాలికను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. బాలికను తిరిగి తీసుకురావడమే మా మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామని అధికారులు అన్నారు.
यह किसी फ़िल्म की शूटिंग नहीं है बल्कि यह असलियत है
राजस्थान में एक महिला को कुछ बदमाशों ने ज़बरदस्ती ऑटो से उतार कर कार में बैठा लिया महिला बचाव का गुहार लगाती रही pic.twitter.com/InQto86LV3
— Priya singh (@priyarajputlive) November 23, 2024