రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్‌కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది.
రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మృతితో షాక్‌కు గురైన భార్య, కుమారుడు కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
BJP Leader: జనాభా నియంత్రణ చట్టానికి సంబంధించి రాజస్థాన్ మంత్రి జబర్ సింగ్ ఖర్రా వివాదాస్పద ప్రకటన చేశారు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు కాదని పేర్కొన్నారు.
నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించినందుకు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నందుకు గత నెలలో యూట్యూబర్ గుజార్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఆ కేసులో కోర్టు అతనికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రాజస్థాన్‌కు చెందిన బన్వరీలాల్ గుజ్జర్‌పై క్రిమినల్ బెదిరింపులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Heart Attack : రాజస్థాన్‌లోని దౌసాలో పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మరణించిన షాకింగ్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. మరణించిన విద్యార్థి పేరు యతేంద్ర ఉపాధ్యాయ. అతని వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ఇక్కడ విశేషమేమిటంటే.. అతను తన పుట్టినరోజును ఒక రోజు ముందు జరుపుకున్నాడు. విద్యార్థి గుండె జబ్బుతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పాఠశాల…
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న పదహారేళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి యతేంద్ర ఉపాధ్యాయగా గుర్తించారు. అయితే.. నిన్ననే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా, ఈరోజు గుండెపోటుతో మరణించాడు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో తరగతి గది లోపలికి వస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.
Crime Thriller Kidnap : తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఏమాత్రం తీసుకొని విధంగా సంఘటన జరిగింది. ఓ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చుదువుతున్న విద్యార్థి ఆన్లైన్ లలో గేమ్స్ ఆడి రూ. 40000 పోగొట్టుకున్నాడు. అయితే ఈ విషయం ఇంట్లో తెలిస్తే తాటతీస్తారని., దాంతో అతను ఓ మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు. తన సొంత కిడ్నాప్ కథను సృష్టించాడు. అందుకోసం తన తల్లిదండ్రుల వద్ద నుండి రెండు లక్షల రూపాయలను డిమాండ్…
ఇటీవలి కాలంలో యువత ప్రేమ అంటూ లేని చిక్కులు తెచ్చుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కూతురు ప్రేమించిన వ్యక్తి తమ కులానికి చెందిన వ్యక్తి కాదని కన్న తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. సమాజంలో పరువు ఎక్కడపోతుందో అని భావించిన తల్లిదండ్రులు ప్రాణాలు కూడా తీసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది.
రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా (72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కేబినెట్ పదవిని త్యాగం చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లాల్ మీనా సవాల్ విసిరారు.
BJP: గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. 25 ఎంపీ సీట్లకు గానూ ఈ సారి బీజేపీ కేవలం 14 చోట్ల విజయం సాధించింది.