రాజస్థాన్‌లో ఓ పెద్ద నాగుపాము వాషింగ్ మిషన్‌లోకి దూరింది. లోపలికి దూరి హాయ్‌గా విశ్రాంతి తీసుకుంటుంది. సడన్‌గా కుటుంబ సభ్యుడు.. వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి చూడగా పాము ప్రత్యక్షమైంది. దీంతో అతడు షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajasthan: ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైంది. ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు దేవరాజ్ అనే బాలుడిపై మైనారిటీ వర్గానికి చెందిన మరో బాలుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత నగర వ్యాప్తంగా మతపరమైన హింస చోటు చేసుకుంది. గాయపడిన బాలుడు నాలుగు రోజుల చికిత్స తర్వాత ఈ రోజు మరణించాడు.
Child Rape: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం హత్య ఘటన ఇంకా మరవక ముందే, రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లా నుండి ఒక బాలికపై లైంగిక వేధింపుల భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చెత్త ఏరుకుని జీవించే వారి మూడేళ్ల కుమార్తెపై అత్యాచారం జరిగింది. అయితే, ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి పాపను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 3 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఆలయం…
Rajasthan: రాజస్థాన్ ఉదయ్‌పూర్ నగరం అట్టుడుకుతోంది. మతహింసతో ఆ నగరంలో హింసాత్మక వాతావరణం ఏర్పడింది. ఇద్దరి విద్యార్థుల మధ్య గొడవ ఆ తర్వాత మత విద్వేషాలకు కారణమైంది.
Triple Talaq: రాజస్థాన్‌కి చెందిన వ్యక్తి పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకునేందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. కువైట్‌లో నుంచి అతను భార్యకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు 35 ఏళ్ల వ్యక్తిని జైపూర్ విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజస్థాన్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జైపూర్‌లోని షిప్రాపత్ పోలీస్ స్టేషన్లో ఆర్మీ జవాన్‌తో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో క్యాబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పోలీసు స్టేషన్ సిబ్బందిని మందలించారు.
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి డజను జింకలను వేటగాళ్లు చంపేశారు. ఈ ఘటనపై సోమవారం సీనియర్ అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చోహ్తాన్ సర్కిల్ ఆఫీసర్ కృతికా యాదవ్ తెలిపారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
దేశ మాజీ విదేశాంగ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ (95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
Marriage On Video Call: రాజస్థాన్‌కి చెందిన ఓ వ్యక్తి, పాకిస్తాన్‌కి చెందిన మహిళలో ప్రేమలో పడ్డాడు. అంతేకాకుండా వీరిద్దరు వీడియో కాల్లో పెళ్లి కూడా చేసుకున్నారు. దీనిపై సదరు వ్యక్తి మొదటి భార్య కేసు నమోదు చేసింది.
మేనకా దామోర్ అనే టీచర్ మాట్లాడుతూ.. పండితులు చెప్పే మాటలను గిరిజన మహిళలు పాటించొద్దని చెప్పారు. గిరిజన మహిళలు సింధూరం పెట్టుకోవద్దు, మంగళసూత్రం ధరించవద్దని బహిరంగ వేదికపై చెప్పుకొచ్చారు. దీంతో ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారింది.