Rajasthan:సైనికుడిని స్టేషన్‌లో బట్టలు విప్పి కొట్టిన పోలీసులు.. మంత్రి ఫైర్
- రాజస్థాన్ లో పోలీసుల అత్యుత్సాహం
- ఆర్మీ జవాన్‌తో అనుచితంగా ప్రవర్తించిన వైనం
- స్టేషన్ లో బట్టలు విప్పిమరీ కొట్టిన పోలీసులు
- కేబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సీరియస్
- చర్యలు తీసుంటామని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జైపూర్‌లోని షిప్రాపత్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మీ జవాన్‌తో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో క్యాబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పోలీసు స్టేషన్ సిబ్బందిని మందలించారు. పోలీసులు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. స్టేషన్ కు చేరుకుని పోలీసులను హెచ్చరించారు.
READ MORE: AP CM Chandrababu: స్కూల్ వ్యాన్‌ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం చంద్రబాబు ఆదేశం
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
అసలేం జరిగిందంటే.. జమ్మూ కాశ్మీర్‌లో కమాండోగా నియమించబడిన అరవింద్ సింగ్ రాజ్‌పుత్ తనకు తెలిసిన వారి కేసుకు సంబంధించి నగరంలోని షిప్రాపత్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. బట్టలు సైతం తొలగించారని బాధితుడు ఆరోపించారు. బాధిత సైనికుడు వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియోలో సైనికుడు మాట్లాడుతూ.. “నా స్నేహితుడు రాజ్‌వీర్ షెకావత్ ఆగస్టు 11వ తేదీ రాత్రి తన స్నేహితులతో పార్టీకి వెళ్లాడు. వైన్ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. అతన్ని షిప్రాపాత్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లాను. అరెస్టుకు గల కారణాలను అడిగితే నాపై అసభ్యకరంగా ప్రవర్తించారు. నన్ను బట్టలు విప్పి రిమాండ్ రూమ్‌కి తీసుకెళ్లి కొట్టారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE:Jharkhand: ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి పరారైన అత్యాచార దోషి..
ఈ ఘటన జరిగిన వెంటనే కేబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ డీజీపీ, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి సీరియస్‌గా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటనలో పాల్గొన్న ఐదుగురు పోలీసుల మానసిక స్థితిని పరిశీలిస్తామని మంత్రి రాథోడ్ తెలిపారు. పోలీసుల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘సైనికుడు ఏదో పని కోసం ఇక్కడకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు బట్టలు విప్పి మరి లాఠీలతో కొట్టారు. ఐదుగురు పోలీసులు కలిసి సైనికుడిపై దాడి చేయడం బాధకరం. సైనికుడి మెడికల్ రిపోర్టు చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు కూడా యూనిఫారాన్ని గౌరవిస్తాను. ఇలా రౌడీయిజం చేసే హక్కు రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదు.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?