రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి డజను జింకలను వేటగాళ్లు చంపేశారు. ఈ ఘటనపై సోమవారం సీనియర్ అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చోహ్తాన్ సర్కిల్ ఆఫీసర్ కృతికా యాదవ్ తెలిపారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 9 జింకల కళేబరాలు లభ్యమయ్యాయని.. మిగిలిన వాటిని ఇంకా గుర్తించలేదని పేర్కొన్నారు.
Read Also: Warangal : ప్రేమలో పడ్డ అన్నా- చెల్లెలు!.. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఆత్మహత్య
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేటగాళ్ళు 13 జింకలను చంపినట్లు తెలిపారు. అంతేకాకుండా.. జింకల కాళ్లు కట్టేసి ఉన్నట్లు, అవి పూర్తిగా ఛిద్రమై ఉన్నాయని పేర్కొన్నారు. కాగా.. 9 జింకల కళేబరాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. జింకలను చంపిన ఘటనపై వన్యప్రాణుల సంరక్షకులు, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో.. అటవీశాఖ అధికారి స్థానిక ప్రజలతో మాట్లాడారు. సంబంధిత వ్యక్తులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని వారిని ఒప్పించారు.
Read Also: Chiyan Vikram: అపరిచితుడు విజయవాడలో రికార్డ్.. విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్