పంజాబ్‌లో మరో కొత్త పార్టీ ఏర్పడబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్ సింగ్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకున్న అమరీందర్ సింగ్, ఢిల్లీలో బిజీగా మారిపోయారు. ఈరోజు కేంద్రంలోని అనేక మంత్రులను, ప్రధాని మోడిని కూడా కలిశారు అమరీందర్ సింగ్. కాగా, ఆయన ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండబోవడం…
పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఏకంగా అమిత్‌షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారగా.. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారంటూ ప్రచారం సాగుతోంది.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ అనూహ్య రాజీనామాతో సంక్షోభం ముదిరింది. అమరీందర్, సిద్ధూ మధ్య విభేదాలు పార్టీని నట్టేట ముంచేలా కనిపిస్తున్నాయి.. ఓవైపు సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అయితే ఆపార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ కు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అధిష్టానం ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుండటంతో నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్…
సిద్ధూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేయడం పట్ల పలువురు నేతలు ఆయన్ను విమర్శించడం మొదలుపెట్టారు. సిద్ధూపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూకి స్థిరత్వం లేదని, అనాడు ఇంగ్లాండ్‌లో భారత జట్టును వదిలేసి వచ్చినట్టుగానే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా మధ్యలో వదిలేసి ఆ పార్టీని నిండా ముంచేశాడని అన్నారు.…
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జగరబోతున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ఎత్తులు వేస్తున్నది. ఇందులో భాగంగా సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పక్కకు తప్పించి ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నికి అవకాశం ఇచ్చింది. దీంతో పంజాబ్‌లో సంక్షోభానికి తెరపడినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే, సడెన్‌గా పంజాబ్ పీసీసీకి సిద్ధూ రాజీనామా చేశారు. ఆయనకు మద్ధతుగా ఓ మంత్రి, ఓ నేత…
ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(21), మన్ దీప్ సింగ్ (15) పరుగులకే వెనుదిరిగ్గారు. ఆ తర్వాత వచ్చిన గేల్(1) కూడా నిరాశపరచగా దీపక్ హుడా(28) తో కలిసి ఐడెన్ మార్క్రమ్(42) ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. కానీ మిగిలిన వారు ఎవరు…
పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక సంక్షోభం ముగిసిందనుకున్న సమయంలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు.. అయితే, తాను పార్టీని వీడడం లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పేర్కొన్నారు. మొత్తంగా పీసీసీ చీఫ్‌గా 72 రోజులు మాత్రమే పనిచేశారు సిద్ధూ.. ఇక, ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు అమరీందర్ సింగ్… “నేను ముందే…
పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఇటీవలే సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. సిద్ధూను ఎప్పటికీ సీఎంను కానివ్వను అంటూ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.. మరోవైపు.. పంజాబ్ కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా తారాస్థాయికి చేరింది.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే, తాను పార్టీని వీడడం లేదని.. మరికొన్ని రోజులు కాంగ్రెస్‌లోనే…
వచ్చే ఏడాది పంజాబ్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ కీలక నిర్ణయం తీసుకొని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా పక్కనపెట్టి పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించింది. దీంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దళితులకు సీఎం పదవి ఇచ్చామని చెప్పడమే కాకుండా పార్టీలో అంతర్గత విభేదాలకు తావులేకుండా చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది.…