పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక సంక్షోభం ముగిసిందనుకున్న సమయంలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు.. అయితే, తాను పార్టీని వీడడం లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పేర్కొన్నారు. మొత్తంగా పీసీసీ చీఫ్‌గా 72 రోజులు మాత్రమే పనిచేశారు సిద్ధూ.. ఇక, ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు అమరీందర్ సింగ్… “నేను ముందే చెప్పాను.. నిలకడ ఉన్న మనిషి కాదు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సరైన వ్యక్తి కాదు”.. అంటూ సిధ్దూ గురించి వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు కెప్టెన్.. కాగా, ఇటీవలే సిద్ధూపై అమరీందర్ సింగ్ హాట్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.. సీఎం పదవి సిద్ధూకు ఇస్తే ఊరుకోనని హెచ్చరించిన ఆయన.. ఎప్పటికీ సిద్ధూను సీఎంను కానివ్వనంటూ కామెంట్ చేసి హీట్ పెంచిన విషయం విదితమే.