సిద్ధూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేయడం పట్ల పలువురు నేతలు ఆయన్ను విమర్శించడం మొదలుపెట్టారు. సిద్ధూపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూకి స్థిరత్వం లేదని, అనాడు ఇంగ్లాండ్‌లో భారత జట్టును వదిలేసి వచ్చినట్టుగానే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా మధ్యలో వదిలేసి ఆ పార్టీని నిండా ముంచేశాడని అన్నారు. సిద్ధూ తనకు చిన్నప్పటి నుండి తెలుసునని, ఆయన మనస్థత్వం అంతేనని, జట్టులో ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఫీలయ్యేవాడని, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పనిచేయలేదని అన్నారు. పొరుగున ఉన్న పంజాబ్‌లో ఆయనకు మంచి మిత్రులు ఉన్నారని, దేశానికి, దేశ భద్రతకు ఆ సంబంధాలు చేటు చేస్తాయని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఇక ఈరోజు పంజాబ్ పర్యటను వెళ్లాల్సి ఉన్న రావత్ పర్యటనను రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ సమస్యను సీఎం చన్నికే వదిలేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది.
Read: మూసారంబాగ్ వంతెనపై కొనసాగుతున్న ఆంక్షలు… వాహనాలకు ఇక్కట్లు…