కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సంవత్సరం కాలంగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. Read: భారీ వర్షాల ఎఫెక్ట్: తిరుచానూరులో వరద తాకిడికి కొట్టుకుపోయిన ఇల్లు… ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ముందడుగు వేసిందని, ఇది కేంద్రంపై రైతులు సాధించిన విజయమని అన్నారు.…
ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణమైన విషయమే.. ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఢిల్లీలో రెండోసారి పీఠం ఎక్కిన ఆ పార్టీ.. ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.. అయితే, ఆప్ మాజీ ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ.. ఇవాళ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. గతంలో బటిండా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు.…
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి తర్వాత మరోటి అన్నట్టు కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి.. నవజ్యోత్ సింగ్, సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య వివాదాలతో.. చివరకు అమరీందర్ పార్టీని కూడా వీడి వెళ్లిపోగా.. కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కొత్త సీఎం చరణ్‌జిత్ చన్నీతో కూడా సిద్ధూకు పొసగని పరిస్థితి వచ్చింది.. అయితే, ఈ పరిణామంలో మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నారు ఈ మాజీ క్రికెటర్.. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ దిగివచ్చారు..…
మౌలిక వసతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ర్యాంకులు దిగజారాయి.. గతంలో ఉన్న ర్యాంకులు నిలబెట్టుకోకపోగా.. రెండు రాష్ట్రాలు తమ ర్యాంకులను కోల్పోయి.. కిందికి దిగజారాయి.. రాష్ట్రాల “లాజిస్టిక్స్ ప్రొఫైల్స్”ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు.. ఈ సారి గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.. అయితే, 2019లో మూడో ర్యాంక్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021 నాటికి తొమ్మిదో ర్యాంక్‌కు దిగజారిపోయింది.. అలాగే, తెలంగాణ 2019లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా, 2021…
పంజాబ్‌లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీని నడిపించబోతున్నట్టు కెప్టెన్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు, 7 పేజీలతో కూడిన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. మరి కొన్ని నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్తపార్టీని ఏర్పాటు చేసిన అమరీందర్ సింగ్…
పంజాబ్‌లో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని అనూహ్యమైన కారణాల వలన అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరి పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు రైతులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్…
పంజాబ్ లో కొత్త పార్టీ అవతరించబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని, పార్టీని స్థాపించిన తరువాత వారంతా తమతో కలిసి వస్తారని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద…
పంజాబ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రారంభించింది. పార్టీలో అంతర్గత సమస్యతను పక్కన పెట్టి ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కాంగ్రెస అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన 13 పాయింట్ల అజెండాను లేఖలో పేర్కొన్నారు. ఈ పాయింట్ల ఆధారంగా మ్యానిఫెస్టోను రూపొందించేందుకు సమయం కావాలని కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి…
సరిహద్దు భద్రతాదళం అధికారాలను పెంచుతూ కేంద్రహోంశాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్లు లోపలి వరకు తనిఖీలు, అరెస్టులు, నిర్బంధం చేసే అధికారాలను బీఎస్ఎఫ్కు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల వరకు మాత్రమే బీఎస్ఎఫ్కు తనిఖీలు, అరెస్టులు చేసే అధికారముంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్…
పంజాబ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉండటంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఎలాగైనా విజయం సాధించేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచిత విద్యుత్ హామీని ప్రకటించింది. ఢిల్లీలో సమర్థవంతంగా ఈ హామీ అమలవుతున్నప్పుడు పంజాబ్‌లో ఎందుకు ఉచిత విద్యుత్ హామీ అమలుకాదని ఆప్ ప్రశ్నిస్తోంది. ఇక ఇదిలా ఉంటే, పంజాబ్…