పంజాబ్‌లో మరో కొత్త పార్టీ ఏర్పడబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్ సింగ్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకున్న అమరీందర్ సింగ్, ఢిల్లీలో బిజీగా మారిపోయారు. ఈరోజు కేంద్రంలోని అనేక మంత్రులను, ప్రధాని మోడిని కూడా కలిశారు అమరీందర్ సింగ్. కాగా, ఆయన ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండబోవడం లేదని స్పష్టం చేశారు. తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయన కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఆ కథనాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. కొత్త పార్టీని ఏర్పాడు చేయడం ఖాయమే అని తేలిపోయింది. అయితే, కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. కొత్తగా అమరీందర్ సింగ్ పార్టీని ఏర్పాటు చేస్తే ఆయన వెంట ఎంతమంది వస్తారు అన్నది తెలియాలి.