బీజేపీ గూటికి కెప్టెన్..? నేడు మోడీతో అమరీందర్‌సింగ్ భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఏకంగా అమిత్‌షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారగా.. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారంటూ ప్రచారం సాగుతోంది.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ అనూహ్య రాజీనామాతో సంక్షోభం ముదిరింది. అమరీందర్, సిద్ధూ మధ్య విభేదాలు పార్టీని నట్టేట ముంచేలా కనిపిస్తున్నాయి.. ఓవైపు సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దాదాపు గంటకుపైగా చర్చలు జరిపారు. కానీ, బీజేపీలో చేరికపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై అమిత్‌షాతో చర్చించానని చెప్పుకొచ్చారు కెప్టెన్ అమరీందర్. ప్రధాని మోడీని కూడా అమరీందర్ కలుస్తారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కాంగ్రెస్‌లో అధ్యక్ష లేమి అంశాన్ని మరోసారి తెరమీదకి తెచ్చారు సీనియర్ నేత కపిల్ సిబల్. పార్టీలో ప్రస్తుతం ఎన్నుకున్న అధ్యక్షుడు ఎవరూ లేరని.. పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఎవరూ తీసుకుంటున్నారో తమకు తెలియదన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సోనియా గాంధీకి లేఖ రాశారు. సిద్ధూ వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అయింది. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని సూచించింది. స్థానిక నాయకత్వమే సమస్యను పరిష్కరించుకోవలని ఆదేశించింది. దీంతో సిద్ధూను చర్చలకు ఆహ్వానించారు పంజాబ్ సీఎం చన్నీ . మొత్తానికి సిద్ధూ రాజీనామాతో మళ్లీ మొదలైన సంక్షోభం ఎన్ని మలుపులకు దారితీస్తోందో అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!