త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికలను అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ తమ సీఎం అభ్యర్థులను సైతం మార్చివేసి తగ్గేదేలే అని చాటిచెబుతోంది. ఇదే ఫార్మూలాను తాజాగా కాంగ్రెస్ సైతం అవలంభిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పంజాబ్, ఉత్తరాఖండ్,…
పంజాబ్ కాంగ్రెస్ సర్కార్‌లో నెలకొన్ని సంక్షోభానికి తెరదింపేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం.. కొత్త సీఎంను.. డిప్యూటీ సీఎంనులను సైతం నియమించింది.. ఇక, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే కొత్త సీఎం చరణ్‌సింగ్ చన్నీకి భారీ షాకే తగిలింది.. అయితే, అది సొంత పార్టీ నుంచో.. అధిష్టానం నుంచో కాదు.. జాతీయ మహిళా కమిషన్ నుంచి.. విషయం ఏంటంటే..? చరణ్ సింగ్‌పై ‘మీటూ’ అరోపణలు ఉన్నాయి.. 2018లో ఆయనపై మీటూ ఆరోపణలు రాగా.. ఆయన కొట్టిపారేశారు..…
పంజాబ్ రాజకీయం మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. అందుకే ప్రధాన పార్టీలు వ్యూహ రచనలు మొదలు పెట్టాయి. అధికార కాంగ్రెస్ మరోసారి పంజాబ్ పీఠమెక్కాలని ప్లానింగ్‌లో ఉంది. కెప్టెన్ అమరిందర్ సింగ్ స్థానంలో చరణ్‌జీత్ సింగ్ చన్నీకి సిఎం పదవి కట్టబెట్టటం అందులో భాగమే. అయితే ఇది కాంగ్రెస్‌లో ఇంటిపోరు భగ్గుమంది.పీసీసీ చీఫ్ సిద్ధూ లీడర్‌షిప్‌లోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందని పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆ…
పంజాబ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రిని మార్చేశారు. గత కొంతకాలంగా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తాయి. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందు నుంచే కెప్టెన్‌కు, సిద్ధూకు మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, సిద్ధూ చాలా కాలం క్రితం నుంచి తనను తాను సీపీపీ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ వచ్చారు. భవిష్యత్తులో తన నేతృత్వంలోనే పంజాబ్ కాంగ్రెస్ నడుస్తుందని పేర్కొన్నాడు. దానికి తగినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం వద్ధ పావులు కదిపారు. పైగా రాహుల్‌గాంధీకి, ప్రియాంక గాంధీకి సిద్ధూకి…
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా, పంజాబ్ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అంతర్గత కలహాల కారణంగా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన పీసీపీ అధ్యక్షుడు సిద్ధూపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. పైగా సిద్ధూను వెనకేసుకు వచ్చింది. రాష్ట్రంలో సిద్ధూకు మంచి పాపులారిటి ఉందని, ముందుండి నడిపించే సత్తా ఉన్న నాయకుడు సిద్ధూ అని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలకు…
పంజాబ్ కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రణ్‌దవాను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తరువాత సిద్ధూపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సిద్దూకి, పాక్ పీఎం, ఆర్మీ చీఫ్‌కి మద్య మంచి సంబంధాలు ఉన్నాయని, పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారుతుందేమో అనే భయం కలుగుతుందని, సిద్ధూ సీఎంగా ఎంపికైతే పంజాబ్‌లోకి పాక్ ఆయుధాలు వస్తాయని తద్వారా దేశంలో కలహాలు రేగే అవకాశం ఉందని అమరీందర్ సింగ్…
బీజేపీ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందా? అంటే అంత అవుననే సమాధానం విన్పిస్తోంది. నిన్నటి వరకు బీజేపీ అధిష్టానం వరుసబెట్టి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేసింది. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏకంగా ఆరుగురు సీఎంలను మార్చివేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ లో బీజేపీ తరహా ఫార్మూలానే ఫాలో అవుతోంది. అక్కడి సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై వేటు వేసింది.…
పంజాబ్ రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్పగించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీకి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్‌ను అంబికాసోనీ తిరస్కరించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా సిక్కు వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తేనే బాగుంటుందని, వచ్చే ఎన్నికల్లో సిక్కు వర్గంనుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే…
పంజాబ్ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. నిన్న సాయంత్రం వరకు ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుందని అనుకున్నా, సిద్ధూ పేరును తెరపైకీ తీసుకొస్తే పూర్తిగా వ్యతిరేకిస్తానని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పడంతో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎవర్ని ఎన్నుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెరపైకి అనేకమంది పేర్లు వస్తున్నాయి. మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా, సుఖ్ సిందర్ సింగ్ రంధ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌల్ భట్టల్ పేర్లు తెరమీదకు…
పంజాబ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. అమరీందర్ సింగ్ రాజీనామాతో ఆ రాష్ట్రంలో నెక్ట్స్ ఎవరు అధికారం చేపడతారు అన్నతి ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన తరువాత అమరీందర్ సింగ్ డైరెక్ట్‌గా సిద్ధూను విమర్శించారు. పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారొచ్చని చెప్పడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక పంజాబ్ రాజకీయాలపై యూపీఏ కూటమిలోని పార్టీలు పలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి…