NIA: ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మద్దతుదారులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూకు సంబంధించిన, అతని కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా బుధవారం ఖలిస్తాన్ మద్దతుదారు లఖ్బీర్ సింగ్ రోడ్ ఆస్తుల్ని జప్తు చేసింది. పంజాబ్ లోని మోగాలో ఎన్ఐఏ దాడులు నిర్వహించిందవి. ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) అధినేత అయిన లఖ్బీర్ సింగ్ రోడ్‌ని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది.
Read Also: Peddapallai: మంథనిలో దారుణం.. మహిళా రేషన్ డీలర్ గొంతు కోసి హత్య
ఆర్డీఎక్స్ తో పాటు పలు ఆయుధాలు, పేలుడు పదార్థాల స్మగ్లింగ్ తో పాటు పలువురు కీలక నాయకులపై దాడి చేయడానికి కుట్ర పన్నిన కేసులో లఖ్బీర్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. పంజాబ్ లో విద్వేషాలను పెంచుతున్నాడు.లఖ్బీర్ సింగ్ ప్రముఖ ఖలిస్తానీ ఉద్యమకారుడైన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు మేనల్లుడు. ప్రస్తుతం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద చర్యలు తీసుకోవాలని NIA ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర ఏజెన్సీ రోడ్ ఆస్తులను జప్తు చేసింది. ఎన్ఐఏ, పంజాబ్ పోలీసులు కలిసి రోడ్ పూర్వీకుల గ్రామంలోని 11 ఆస్తుల్ను జప్తు చేసింది.