Medaram Priests: వరంగల్‌లో దేవాదాయ శాఖ వర్సెస్ మేడారం అర్చకులకు, దేవాదాయ శాఖకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మేడారం పూజారులు ఆందోళనకు సిద్ధమవడం హాట్ టాపిక్‌గా మారింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. అక్కడ హింసాత్మక నిరసనలకు పాకిస్థాన్ ప్రభుత్వం మోకరిల్లింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల సీట్ల వ్యవహారాలు సద్దుమణుగడం లేదు. పార్టీలో సముచిత స్థానం లభించలేదని కొందరు.. రాజీనామాలు చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజకీయ పార్టీలు కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చి వేరే అభ్యర్థులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తాజాగా.. ఉండిలో టీడీపీ శ్రేణులు రగులుతున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నివాసం వద్ద మాజీ మంత్రిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ…
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని వెంటనే గిట్టుబాటు ధరకు సేకరించాలని ఆయన సర్కారును కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నిరసన చేపట్టారు.
ఎన్నికలకు సన్నద్ధం అవుతోన్న టీడీపీ - జనసేన.. ఉమ్మండిగా తొలి జాబితాను ప్రకటించాయి.. అయితే, అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ జిల్లాల్లో.. నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కారు. మొత్తం 99 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ-జనసేన. కానీ.. తొమ్మిది నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి.. ఎనిమిది సెగ్మెంట్లల్లో టీడీపీ.. ఒక నియోజకవర్గంలో జనసేనలో అసంతృప్తుల ఆందోళనకు దిగారు..
కర్ణాటక (Karnataka Congress) రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హీటెక్కాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం ఆరోపించింది.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేయనున్నారు. కేంద్రం పన్నులను బదిలీ చేయడం లేదని.. రాష్ట్రానికి ఆర్థిక సహాయం కూడా చేయడం లేదని వారు ఆరోపించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళనకు దిగింది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్ కు తరలించేందుకు మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది.