Shamshabad Airport Cab Drivers Protest: తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ లు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్ట్ లో ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడపడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వారు. వేలాది క్యాబ్ లను పార్కింగ్ లో నిలిపివేసి క్యాబ్ డ్రైవర్స్ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరిమించేది లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎయిర్ పోర్ట్ వద్ద…
రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొననున్నారు. ఇండియా కూటమికి చెందిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆమె కూడా సమావేశానికి హాజరుకాకుండా ఉంటారా అనే సస్పెన్స్ కు తెర తీసింది. ఈ క్రమంలో.. నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం ఇండియా కూటమి రంగంలోకి దిగబోతుంది. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్టై.. తీహార్ జైల్లో ఉంటున్నారు. దాదాపు నాలుగు నెలల నుంచి జైల్లో ఉండడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు.. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోని సంఘీభావం ప్రకటించారు.
జార్ఖండ్‌లో అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనకు పూనుకున్నారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాజధాని రాంచీకి భారీగా పోలీస్ సిబ్బంది తరలివచ్చారు.
మధ్యప్రదేశ్‌లో దేవా అనే గిరిజన యువకుడు లాకప్ డెత్ తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గుణలో పార్ధి వర్గానికి చెందిన 25 ఏళ్ల గిరిజన యువకుడు పోలీస్ కస్టడీలో మరణించాడు.
శనివారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం అమ్మకం పన్ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.3, డీజిల్ రూ.3.05 చొప్పున పెరిగింది.
తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాలు తీసివేయడానికి నిరసిస్తూ ఖిలా వరంగల్‌లోని కాకతీయ కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ రాజుల పాలన దీక్షకు ప్రతీక అయిన కాకతీయ కళా తోరణాన్ని దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తన్నట్టు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్,…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని (రాజోలు) మామిడికుదురు మండలం పరిధిలోని పెదపట్నం లంకలో రోడ్డెక్కిన గ్రామస్తులు త్రాగు నీరు అందించాలని కాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.