కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నిరసన చేపట్టనుంది. ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నట్లు పేర్కొంది. కేరళ, ఇతర బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా నిర్లక్ష్యం చేసిందని ఆందోళన చేయడం ఈ నిరసన లక్ష్యమన్నారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. ఇది.. కేవలం కేరళ సమస్యలకు సంబంధించినది కాదని, ఇతర బీజేపీయేతర రాష్ట్రాలు పంచుకుంటున్న…
పాకిస్థాన్ కు వ్యతిరేకంగా అమెరికాలోని వైట్ హౌస్ ముందు బలూచిస్థాన్ వలసదారులు ఆందోళనకు దిగారు. గత 75 ఏళ్లలో బలూచిస్థాన్‌లో జరిగిన అకృత్యాలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని బలూచిస్థాన్ అసెంబ్లీ మాజీ స్పీకర్ వహీద్ బలోచ్ నిరసన వ్యక్తం చేశారు.
హిట్ అండ్ రన్ చట్టం కింద శిక్షా కాలాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు నిరసనలు చేపట్టారు. కొత్త చట్టం ప్రకారం.. డ్రైవర్లు ప్రమాదం చేసి పారిపోయినందుకు, ప్రాణాంతక ప్రమాదాన్ని నివేదించకపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఇంతకుముందు.. IPC సెక్షన్ 304A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), నిందితుడికి రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉండేది. అయితే.. శిక్షా కాలాన్ని పెంచాలని కోరుతూ హర్యానాలోని జింద్‌లో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు…
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు, చేర్పులు ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. సిట్టింగ్ లను మార్చొందంటూ ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
అంగన్వాడీల ఆందోళనల నేపథ్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బహిరంగ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి అంగన్వాడీలకు విఙప్తి చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో అంగన్వాడీలకు ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన చెప్పారు. దేశంలో ప్రజా స్వామ్యం ఉందా.. నియంతృత్వ పోకడతో పాలన నడుస్తుంది.. దేశాన్ని రక్షించాలి అని ఆలోచన బీజేపీకి లేదు.. 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి? అని భట్టి విక్రమార్క అన్నారు.
అంగన్వాడీల గురించి పట్టించుకునే పరిస్ధితి లేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కనీస వేతనం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కస్టపడి సాగు చేసుకునే వారి భూములు తీసుకుని.. ట్యాబులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. బలవంతంగా తాళాలు పగలకొట్టి గొడవను ఎక్కువ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీలో అంగన్వాడీలు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. వాలంటీర్ల చేత అంగన్వాడీ…
ఇవాళ పార్లమెంట్లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ధర్నా చౌక్ ని యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ధర్నా చౌక్ ని ఆయన పరిశీలించారు.