Water Crisis: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని (రాజోలు) మామిడికుదురు మండలం పరిధిలోని పెదపట్నం లంకలో రోడ్డెక్కిన గ్రామస్తులు త్రాగు నీరు అందించాలని కాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. త్రాగడానికి మంచినీళ్లు లేక నెల రోజులగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంటి పిల్లలు మంచినీరు లేక రాత్రుళ్ళు అలమటిస్తున్నారని తక్షణం మంచి నీళ్ళు అందించాలని లేని పక్షంలో కలెక్టరేట్ ఆఫీసు ముందు ఆందోళన చేపడతామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.
Read Also: Today Gold Rate: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవే!
అయితే, ఓ వైపు ఎండలు 50 డిగ్రీలకు చేరువ అవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎండల ధాటికి చెరువులు, కుంటల్లో ఉన్న నీరు పూర్తిగా అడుగంటిపోయాయి. కనీస అవసరాలకు సైతం నీరు దొరకని పరిస్థితి ఏర్పాడింది. అలాగే, భూగర్భ జలాలు ఇంక కుండా ఎక్కడికక్కడ రహదారులు, నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా చేపట్టడంతో పాటు తరచూ వర్షాభావం, కరవులు వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో నీటి కొరత ముప్పు మరింత పెరగగకుండా ఉండాలంటే నీటి వృథాను అరికట్టి పొదుపు చేయాలని నిపుణులు చెబుతున్నారు.