అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలపై భారత విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది. ప్రతి ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, బాధ్యత, ప్రజల భద్రత మధ్య సరైన సమతుల్యత ఉండాలని పేర్కొంది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడికి సంబంధించి కొలంబియా యూనివర్శిటీలో నిరసనల తర్వాత యేల్, న్యూయార్క్ యూనివర్సిటీలతో సహా అనేక ఇతర విద్యా సంస్థలలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి.
Read Also: Kalki 2898 AD : ‘కల్కి’తో సరికొత్త ప్రపంచం ఆవిష్కరించబోతున్న నాగ్ అశ్విన్..?
అయితే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. మేము ఈ విషయంపై నివేదికలను చూశామన్నారు. ప్రతి ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ, బాధ్యత, ప్రజా భద్రత, సమతుల్యత ఉండాలన్నారు ప్రజాస్వామ్య దేశాలు ముఖ్యంగా తమలాంటి ఇతర దేశాలపై ఈ అవగాహనను ప్రదర్శించాలని ఆయన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం, మిచిగాన్ విశ్వవిద్యాలయం, టెక్సాస్ విశ్వవిద్యాలయంతో పాటు ఇతర దేశాల విద్యార్థులు ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా పాలస్తీయన్లు తీవ్ర నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్థులను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు. అదే సమయంలో అమెరికా యూనివర్సిటీల్లో పాలస్తీనా అనుకూల విద్యార్థులు చేస్తున్న నిరసనలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు.