దేశంలో అడ్డూ-అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఇంధన ధరలపై రైతు సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ఈ నెల 8న దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిరసన తెలపనున్నారు రైతులు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. ఖాళీ గ్యాస్ సిలెండర్లతో నిరసన తెలపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘూ…
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి నిరసన సెగ తగిలింది. కమలాపూర్ మండలం భీంపెల్లిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని నిలదీశారు గ్రామస్థులు. డబుల్ బెడ్ రూమ్, పించన్, దళితులకు మూడెకరాల భూమి ఎదని నిలదీశారు భీంపెల్లి గ్రామస్థులు. రైతులకు రైతుబందు, భీమా ఇచ్చి ఏ భూమి లేని పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం ఇచ్చిందని నిలదీశారు పేదలు. ఇక్కడే కాదు గ్రామ, గ్రామాన టిఆర్ఎస్ నాయకులను నిలదీస్తున్నారు గ్రామస్థులు. అయితే గ్రామస్థులు నిలదీస్తున్న విజువల్స్ చిత్రీకరించే పాత్రికేయులపై…
రుయా ఆస్పత్రిలో నర్సులు ఆందోళన చేస్తున్నారు. నర్సుపై సూపరింటెండెంట్ విచారణ వేయడంపై ఈ నిరసన చేస్తున్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వినియోగంలో నర్సుపై ఆరోపణలు వేశారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేసారు. ఆరోపణలపై విచారణ చేస్తున్నారు రుయా సూపరింటెండెంట్ భారతి. అయితే ఈ సూపరింటెండెంట్ వైఖరిని నిరసిస్తూ నర్సులు ఆందోళన చేపట్టారు. అయితే నర్సులపై వేధింపులు మానుకోవాలని సూపరింటెండెంట్ కు వినతిపత్రం అందించారు.
నేడు ఏపీ జూనియర్ డాక్టర్లు ఆందోళన జరుగుతుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చటం లేదంటున్న జూడాలు.. రుయా ఆసుపత్రిలో తొలుత నాన్ కొవిడ్, తర్వాత కొవిడ్ విధులను బహిష్కరించనున్నారు. కొవిడ్ ఇన్సెంటివ్లు, ఉపకార వేతనాల నుంచి కోతలు, రోగుల కుటుంబ సభ్యుల నుంచి జూడాలకు భద్రత తదితర విషయాల్లో ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే రెండు రోజుల కిందటే జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈరోజు…
కడప జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు… రిమ్స్ లో బ్లాక్ రిబ్బన్స్ తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లకు 40 వేల వేతనం నుంచి 80 వేల కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా విధులలో పాల్గొన్న డాక్టర్లకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు. ఎన్నో నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదంటున్న డాక్టర్లు… న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కారించకపోతే విధులకు…
భారీగా పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఈ సందర్బంగా సీపీఎం నేత బాబూరావు మాట్లాడుతూ… కరోనా కష్టాల్లో జనం ప్రాణలు కోల్పోతుంటే మోడీ మాత్రం పెట్రోల్ ధరలు మే నెలలో 9 సార్లు పెంచారు. అంబాని, ఆధానిల వ్యాపారం కోసం పెట్రోల్ పై పన్నులు పెంచుతున్నారు అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు తగ్గిస్తాం అని చెప్పి ఇప్పుడేం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా వ్యవస్థ కూలిపోయింది. కేంద్ర…
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం లోడ్ కోసం వచ్చిన లారీని అడ్డుకున్నారు రైతులు. సన్నరకం ధాన్యాన్ని కాంటాలు పెట్టకుండా దొడ్డు రకం ధాన్యాన్ని లోడ్ చేయించేందుకు వచ్చిన అధికారులతో పాటు లారీని అడ్డుకున్నారు రైతులు. లారీ టైర్ కింద పడుకుని నిరసన వ్యక్తం చేసారు ఓ రైతు. వెంటనే సన్నరకం ధాన్యం కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేసారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యనిర్వహణ అధికారిపై…
ఎన్నికలు అయిపోగానే.. బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. మమతా బెనర్జీ కేబినెట్ మంత్రిని ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. సిఎం మమతా బెనర్జీ తో సహా టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓటమిని బిజేపి ఓర్చుకోలేక పోతుందని.. అందుకే తమ నేతలను అరెస్ట్ చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి ఫిర్హాద్ హకీంను వెంటనే విడుదల చేయాలని వారు…