Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన సంజౌలీ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు నిన్న (శుక్రవారం) నీటి ఫిరంగులతో పాటు లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. జాయింట్ సీపీకిఫిర్యాదు చేశారు. సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లిఖిత పూర్వక ఫిర్యాదు రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. దాడికి సహకరించిన పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశ…
సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హరీష్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. సీపీ ఆఫీస్‌లోకి ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుమతి ఇచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేలందరినీ అనుమతించాలంటూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో.. తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో.. తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేస్తున్నారు.
Perni Nani: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మాజీ మంత్రి పేర్ని నాని కారు పైన కోడిగుడ్లతో దాడి జరిగింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Farmers Protest 200 Days: పంజాబ్-హర్యానా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది తరలివస్తారని పేర్కొంటూ సరిహద్దులో రైతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా చేరుకోనున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల హృదయాలను కలిచివేస్తోంది. ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురి కావడంతో మానవత్వం ఉన్న ప్రతివారి హృదయాలను చలింపచేస్తోంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ట్రాన్స్‌జెండర్స్ కూడా రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. శనివారం వైద్యులు, నర్సులు 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ చేశారు. దేశ వ్యాప్తంగా వైద్య బృందాలతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు నిరసన తెలిపారు
Kolkata RG Kar Medical College Vandalised : కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.