Nirmal: బ్లాక్ మెయిలర్లు, చీటర్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు.. కాంగ్రెస్ నేతల నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నివాసం వద్ద మాజీ మంత్రిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడికి వినతిపత్రం అందజేశారు. మాజీమంత్రి అతని కుటుంబీకులు అక్రమంగా ఆక్రమించుకున్న చెరువులు, కందకాలు డి1 పట్టాలను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
గత రాజకీయ చరిత్ర అంతా ఊసరవెల్లి లాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా పట్టుకుంటూ, 30 సంవత్సరాల రాజకీయంలో విలువలు సిద్ధాంతం లేని వ్యక్తి మాజీ మంత్రి అల్లోల అని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత పది సంవత్సరాలుగా మంత్రిగా ఉండి కనిపించిన చెరువుని, గుడిని గుడిలో ఉన్న లింగాన్ని భూములను, మున్సిపల్ ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి కుటుంబ అధికార దాహాన్ని భరించలేకనే ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడితే.. సిగ్గు లేకుండా అధికార పార్టీలోకి వస్తా అంటున్నావని మండిపడ్డారు. 78 సంవత్సరాలు వచ్చినా.. ఇంకా అధికార దాహం తీరలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి నాయకున్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు. కబ్జా మాజీ మంత్రి పార్టీలోకి వస్తే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
Also Read
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేత..
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అవినీతి భూకబ్జాల బీఆర్ఎస్ నేత మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దంటూ విన్నవించారు.
బ్లాక్ మెయిలర్స్, చీటర్లను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు..
బ్లాక్ మెయిలర్స్, చీటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జూ అన్నారు. మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దంటూ నిరసన ఆందోళన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం గమనిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చే విషయం తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
తాజావార్తలు
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!