Ustaad Bhagat Singh: బావ.. మాటల్లేవ్! టాప్ లేచిపోద్ది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు రంగం సిద్ధమైంది. రిలీజ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా పై భారీగా అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దేవి బిజీగా ఉండడం వల్లో మరో కారణమో తెలియదు గానీ, సినిమా ప్రీ పోన్ అవడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ను రంగంలోకి దింపారు మేకర్స్. ఇక ఇప్పుడు తమన్ తన పనులను పూర్తి చేశాడని హరీష్ శంకర్ పోస్ట్ చేశాడు.
Also Read: Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!
Also Read
తమన్‌ను ‘బావ’ అని సంబోధిస్తూ.. తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటలు సరిపోవడం లేదని హరీశష్ శంకర్ పేర్కొన్నారు. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక తాను చాలా సంతోషంగా ఉన్నానని.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చిందని.. థియేటర్ టాప్ లేచిపోద్ది అనేలా పోస్ట్ చేశాడు. దీంతో ఉస్తాద్ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. పవన్ ఓజీ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్.. సినిమా హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చివర్లో వచ్చి ఉస్తాద్‌కు తమన్ అదిరిపోయే స్కోర్ ఇచ్చాడని హరీష్ చెప్పడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, థమన్ అదిరిపోయే బీట్స్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా.. మార్చి 19న బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వస్తున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?