ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల సీట్ల వ్యవహారాలు సద్దుమణుగడం లేదు. పార్టీలో సముచిత స్థానం లభించలేదని కొందరు.. రాజీనామాలు చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజకీయ పార్టీలు కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చి వేరే అభ్యర్థులను నియమిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తాజాగా.. ఉండిలో టీడీపీ శ్రేణులు రగులుతున్నారు.
Read Also: Kissing Controversy: “ఇది ఆప్యాయత, దీంట్లో తప్పేముంది”.. బీజేపీ నేత ముద్దుపై యువతి వ్యాఖ్యలు..
ఉండి టీడీపీ టిక్కెట్ అభ్యర్థి మార్పు వ్యవహారం తీవ్ర రచ్చరేగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును మార్చొద్దు అంటూ జిల్లా అధ్యక్షురాలు తోట సీతా రామలక్ష్మి ఇంటిని ముట్టడించారు టీడీపీ నాయకులు. ఆమె ఇంటి ముందు కూర్చుని ఉండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వన్ని మార్చితే సహించేది లేదంటూ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో.. ఇప్పటికే క్యాడర్ రాజీనామా పత్రాలను అధినేతకు అందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును కొనసాగిస్తామంటూ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Fake Robbery: ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా.. సీన్ కట్ చేస్తే..?!