Medaram Priests: వరంగల్‌లో మేడారం పూజారులు ఆందోళనకు సిద్ధమవడం హాట్ టాపిక్‌గా మారింది. వరంగల్‌లో ధార్మిక భవనం స్థలం విషయంలో మేడారం పూజారులు, దేవాదాయ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మేడారం పూజారులు నిరసనలకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం 1993లో అప్పటి ప్రభుత్వం వరంగల్‌లోని రంగంపేటలో 1000 గజాల స్థలాన్ని కేటాయించింది. అయితే.. ఈ స్థలంలో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. అనంతరం వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారుల కార్యాలయాల వారు ఏర్పాట్లు చేశారు.
Read also: Kishan Reddy: బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. కిషన్ రెడ్డి ఫైర్
ఈ క్రమంలో ధార్మిక భవనాన్ని, స్థలాన్ని దేవతా శాఖ పరిధిలోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని మేడారం అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది మేడారం సమ్మక్క సారక్క దేవతలకు కేటాయించిన స్థలం అని మేడారం పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై.. మంత్రులు, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. మే 29, 30 తేదీల్లో మేడారం గద్దెల ప్రాంగణానికి తాళం వేసి ధర్నా చేస్తామన్నారు. ఇదిలావుంటే.. తాజాగా.. దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ కీలక సమీక్ష చేశారు. అంతేకాకుండా వివాదాన్ని పరిష్కరించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారనేది వేచి చూడాలి. అయితే.. మే 29, 30 తేదీల్లో మేడారం గద్దెల ప్రాంగణానికి తాళం వేసి ధర్నా చేపడతామనడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో హాట్ టాపిక్ గా మారింది.
Supreme Court : ఎనిమిది మంది పీఎఫ్ఐ సభ్యులకు షాక్.. బెయిల్ రద్దు