Jeevan Reddy: నేను పార్టీ వీడతానని సంజయ్‌కు చెప్పానా?.. మా పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టాడు!
- తనతో కలిసి పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే ఆఫర్ ఇచ్చారు
- సంజయ్ బీఆర్ఎస్‌లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు
- నాకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు?
- నేను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనతో కలిసి పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనకు ఆఫర్ ఇచ్చాడని సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు?, తనను ఎలా కలిసి రమ్మంటారని మండిపడ్డారు. సంజయ్ బీఆర్ఎస్‌లో ఉన్నారని స్పీకర్ అంటున్నారని.. కాంగ్రెస్‌లో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారన్నారు. తనకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు? అని.. తాను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా? అని ప్రశ్నించారు. పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం సంజయ్ కాదా? అని.. తమ పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయే అని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న అసెంబ్లీ లాబీల్లో చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి స్పందించారు. ‘జగిత్యాల ఎమ్మెల్యే తనతో కలిసి పనిచేయాలని నాకు ఆఫర్ ఇచ్చారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు.. నన్ను ఎలా కలిసిరమ్మంటున్నారు. స్పీకర్ ఏమో సంజయ్ బీఆర్ఎస్‌లో ఉన్నారని అంటారు.. సంజయ్ ఏమో కాంగ్రెస్‌లో కలిసి పని చేయాలని అంటారు. సంజయ్ ఎవరు నాకు ఆఫర్ ఇవ్వడానికి?. నేను పార్టీ వీడతనాని ఆయనకు చెప్పానా?. వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు?. పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం సంజయ్ కాదా?. మా పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయ్. ఏ పార్టీనో ముందు నువ్వు తేల్చి చెప్పు సంజయ్. నువ్వు ఎవరు కలిసి పనిచేయాలని అంటావు. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవడం ఎంత బాధగా ఉంటది?. ఎంత బాధ ఎంత ఇబ్బందిగా ఉంటే పార్టీ వీడాలనే నిర్ణయం తీసుకుంటామో అర్థం చెస్కోవాలి’ అని జీవన్ రెడ్డి అన్నారు.
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
‘నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం నాది. బలహీన వర్గాల మహిళకు కేటాయించిన చైర్మన్ సీట్ నుంచి అడబిడ్డను దించేశావు. సంజయ్ చదువుకున్న వాడు, చట్టం కూడా తెలుసు. జగిత్యాల అభివృద్ధి కోసం అని 20 నెలలుగా చెబుతున్నారు. యావర్ రోడ్డు విస్తరణ ఏమైంది సంజయ్. యావర్ రోడ్డు విస్తరణ అభివృద్ధిలో భాగం కాదా?. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మౌళిక సదుపాయాలు అభివృద్ధిలో లేవా?. నేను తీసుకునే ప్రతీ నిర్ణయం రాజ్యాంగ బద్దంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని పాటించని వ్యక్తి నాకు నీతులు చెప్తున్నాడు. నేను కాంగ్రెస్లోనే ఉండాలని అనుకుంటున్నా. కానీ ఉండే పరిస్థితులు తేకపోతే ఏమి చేస్తాం. ఇంట్లో వుడుము వస్తే ఇల్లు ఇడిచి పెడతాం.. అలాగే సంజయ్ ఉడుము లాగా వచ్చి కాంగ్రేస్లో చేరాడు. ప్రజలు ఎవరికి ఏ బాధ్యత ఇస్తే అది నిర్వర్తించాలి. ప్రజలు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించకుండా ఉంటే వారు ఆ పదవికి అనర్హుడు’ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
Also Read: YS Jagan: ప్రజల తరఫున అనేక పోరాటాలు చేశాం.. గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్!
‘నేను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్‌ని వదిలిపెట్టడానికి సంజయ్ కారణం అవుతారు. సంజయ్‌ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్‌లోని మిత్రులు ఈ విషయంలో మాట్లాడుతున్నారు. నాకు కార్యకర్తల అభిప్రాయాలు ముఖ్యం. కాంగ్రెస్ అధిష్టానంది కూడా బాధ్యతే. నేను పార్టీని వీడటంలో సంజయ్‌ది ఒక్కటే పాత్ర కాదు. ఆరు గ్యారంటీల అమల్లో జాప్యం ఉంది.. అసంతృప్తి ప్రజల్లో ఉంది. నేను పార్టీని వీడితే పార్టీ అగుతుందా?, ఒక్కడు పోతే ఆగదు. కాంగ్రెస్లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలను దూరం పెట్టడమే పరిష్కారం. పార్టీ వారిని దూరం పెడుతుందా?. అలా అయితే కాంగ్రెస్లో సమస్యకు పరిష్కార మార్గం వచ్చినట్టే’ అని జీవన్ రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!