Elon Musk: ప్రధాని నరేంద్రమోడీతో బిలయనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఈ ఏడాది భారత్‌లోకి టెస్లా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇరువురు మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీతో మాట్లాడిన ఒక రోజు తర్వాత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో తాను ఇండియాకు వస్తానని, ఈ పర్యటనపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
భగవద్గీత, భరత ముని నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో వీటిని చేర్చారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణం అని ఆయన అభివర్ణించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడిగా ఎవరొస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనుంది. ఏప్రిల్ 22, 23 తేదీల్లో ప్రధాని మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.
భగవద్గీత, నాట్య శాస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. ఈ విషయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయంగా పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 9 మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విక్టరీ డే వేడుకలకు పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది రష్యా. అందులో భాగంగా భారతదేశానికి సైతం ఆహ్వానం పంపినట్లు రష్యా తెలిపింది. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే…
రాజధాని అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. పునఃప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఏపీ సర్కారు ఎంపిక చేసింది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. రాజధాని నిర్మాణాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంకు 5 లక్షల…
ఇక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కుట్రలు చేసి అధికారంలోకి రావడానికి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నాను అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనింది.
అంబేద్కర్ జయంతి రోజున హర్యానాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ప్రధాని మోడీ హర్యానాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక అభిమానిని ప్రధాని మోడీ కలిశారు. అంతేకాదు.. ఆ అభిమానికి స్వయంగా మోడీనే పాదరక్షలు తొడిగించారు.
PM Modi: హర్యానా హిస్సార్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు చట్టాలను మార్చిందని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్ఫ్ బోర్డు రూల్స్‌ని కాంగ్రెస్ మార్చిందని అన్నారు. కాంగ్రెస్‌కి ఓటు బ్యాంక్ వైరస్ పట్టుకుందని విమర్శించారు.