ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరిలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీకి స్పష్టమైన మేజిక్ ఫిగర్ దాటింది. కానీ ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం చాలా ఆలస్యం అయింది. దీనికి కారణం.. ఆ సమయంలోనే ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు.
జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్రం, కొన్ని రాష్ర్ట ప్రభుత్వాల మధ్య వివాదం సాగుతున్న విషయం విదితమే. తాజాగా వీటిని వ్యాతిరేకిస్తూ.. తమిళగ వెట్రి కళగం పార్టీ తీర్మానాలు చేసింది. శుక్రవారం తిరువన్మయూర్లో వియజ్ ఆధ్వర్యంలో తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది. ఈ సమావేశానికి హాజరైన విజయ్ ప్రసంగించారు.
PM Modi: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏప్రిల్ 06న ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇదే రోజు కొత్త ‘పంబన్ బ్రిడ్జ్’ని ప్రారంభిస్తారు. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తుంది. సముద్రంలో ఉన్న పాత వంతెన తుప్పు పట్టడంతో 2022లో మూసేశారు. 1914లో నిర్మించిన ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది. Read Also: India On USCIRF: మైనారిటీలపై యూఎస్…
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా మాజీ ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. సంజయ్ మిశ్రా ఈఏసీ-పీఎంలో పూర్తి సభ్యుడిగా ఉండనున్నారు. సంజయ్ మిశ్రా 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను) రిటైర్డ్ అధికారి. ఆర్థిక నిపుణుడు. అనేక ఉన్నత స్థాయి కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ఈడీ చీఫ్గా ఆయన పదవీకాలం నవంబర్ 18, 2023 వరకు రెండుసార్లు పొడిగించబడింది.
రాజధాని అమరావతి పునఃనిర్మాణం వైపు వేగంగా అడుగుల వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల మూడో వారంలో ప్రధాని మోడీ రాజధాని రీ లాంచ్ కార్యక్రమానికి వస్తారని తెలిపారు మంత్రి నారాయణ.. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశం అవుతారన్నారు.. రాజధాని ప్రాంతంలో సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణ.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.. నిర్మాణంలో ఉన్న భవనాలు 115 కాగా.. సెక్రటరీలకు 90, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు 25…
దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశంపై ఉత్తరాది.. దక్షిణాదిల మధ్య గంభీరమైన వాతవరణం నెలకొంది. చెన్నై కేంద్రంగా డీఎంకే ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్కి సౌత్ సీఎంలు, పలు రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని డీఎంకే ప్రతినిధులు వైసీపీని కూడా ఆహ్వానించారు. జగన్ గతంలో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు పలికాయి.
YS Jagan: డీలిమిటేషన్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉంది.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి.
Jaya Bachchan: ప్రముఖ బాలీవుడ్ నటి, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. నిత్యం బీజేపీ, బీజేపీ నాయకులను సభలో విమర్శించే జయాబచ్చన్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. 2004 నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న జయా.. ఇటీవల ఒక డిబేట్లో రాజకీయాల్లోకి సినీ యాక్టర్స్ ప్రవేశం గురించి, వారి ప్రజాదరణ గురించి మాట్లాడారు. ప్రజాదరణ రాజకీయ పార్టీలకు ఎలా ప్రయోజనకరంగా మారుతుందో వెల్లడించారు. రాజకీయాల్లో సినీ నటులకు ఉండే…
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక చాలా ఉల్లాసంగా సాగినట్లుగా కనిపిస్తోంది. వాతావరణం పూర్తిగా ఆమెకు అనుకూలంగా మారింది. ఇక ఆమె రాకను ప్రజలే కాదు.. ప్రకృతి కూడా పులకించింది. సునీతా విలియమ్స్ను తీసుకొచ్చిన క్యాప్సూల్.. సముద్రంపై ల్యాండ్ కాగానే ఆమె చుట్టూ డాల్ఫిన్ల గుంపు తిరుగుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.