Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్ని ఇస్లామిక్ టెర్రరిస్టులు దారుణంగా చంపేశారు. మతం, పేరు అడుగుతూ మరీ హిందువుల్ని టార్గెట్ చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్ అంతటా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా భయాందోళనతో వణికిపోతున్నారు. భారత ఆర్మీని చూసినా కూడా మహిళలు, చిన్నారులు గజగజలాడిపోతున్నారు. నిన్నటి ఘటనతో ఒక విధమైన భీతావాహ వాతావరణం ఏర్పడింది.
Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేందుకే విదేశీ అతిథుల భారత పర్యటనలో ఉండగానే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చే రహదారులను ఆయన పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. కొన్ని రోడ్లు వెంటనే వెడల్పు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ అధికారులకు చెప్పారు. ప్రధాని మోడీ మే 2న అమరావతి రాజధాని…
ప్రధాని మోడీ అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. కాసేపట్లో మోడీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటన కోసం మంగళవారం జెడ్డా వెళ్లారు. వాస్తవానికి తిరిగి బుధవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలి.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని శోకానికి గురి చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై ముష్కరులు కాల్పులు జరిపారు. పహల్గామ్లోని బైసరీన్ గడ్డి మైదానాల వద్ద ఈ ఘటన జరిగింది. ఆ దుశ్చర్యలో 27 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషాద సమయంలో భారత్‌కి అండగా నిలుస్తామని చెబుతున్నాయి. Read Also: Danish Kaneria: ‘‘హిందువులే టార్గెట్’’..…
ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ తరుపున ఆడిన అతికొద్ది మంది హిందూ క్రికెటర్లలో ఒకరైన దానిష్ కనేరియా స్పందించారు. ‘‘పహల్గామ్ దాడిని క్రూరమైన దాడి’’గా ఖండించారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి బెంగాల్, కాశ్మీర్ వరకు అదే మనస్తత్వం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ ఈ లౌకికవాదులు, న్యాయవ్యవస్థ దాడి చేసిన వారిని అణిచివేయబడిన మైనారిటీగా ముద్రవేస్తోంది’’ అని ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. తన పోస్టులో భర్తను కోల్పోయిన మహిళ,…
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్నారు. ఆయన సతీమణి భారత సంతతికి చెందిన ఉషా వాన్స్, పిల్లలతో కలిసి భారత్ వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు, భారత సంతతికి చెందిన సెకండ్ లేడీ ఉషా చిలుకూరి, వారి ముగ్గురు పిల్లలు - కుమారులు ఇవాన్, వివేక్ మరియు కుమార్తె మిరాబెల్ నాలుగు రోజుల భారతదేశ పర్యటన కోసం సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రస్తుతం వస్తున్న వివరాల ప్రకారం, 27 మంది వరకు టూరిస్టులు ఈ దాడిలో మరణించినట్లు సమాచారం.
ప్రధాని మోడీ.. బైసరన్ లోయలోకి వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరినీ కూడా వదిలి పెట్టమని హెచ్చరించారు. నిందితులను న్యాయస్థానం ముందు నిలబెడుతామని ప్రతిజ్ఞ చేశారు.