నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరింది. దాదాపు 9 తొమ్మిది నెలల తర్వాత ఆమె భూమ్మీద అడుగుపెట్టింది. క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ సునీతా విలియమ్స్ చిరునవ్వులు చిందించారు. అందరికీ హాయ్ చెబుతూ.. చాలా ఉల్లాసంగా కనిపించారు. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. చాలా ఉత్సాహంగా.. ఆనందంగా ఉన్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమ్మీదకు చేరుకుంది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమ్మీద ల్యాండ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులతో పాటు ప్రజలంతా స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై కీలక నిర్ణయం తీసుకుంది.. వచ్చే నెల అంటే ఏప్రిల్ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది.. ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం.. ఇక, అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరిగిన ‘‘మహాకుంభమేళా’’ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్లో కొనియాడారు. లోక్‌సభలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కుంభమేళా విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారతదేశ కొత్త తరం మహా కుంభమేళాతో కనెక్ట్ అయిందని, న్యూ జనరేషన్ సంప్రదాయాలు, విశ్వాసాన్ని గర్వంగా స్వీకరిస్తోందని, కుంభమేళ ప్రపంచం మొత్తానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిందని, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత,
మహా కుంభమేళాపై పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా అవకాశమివ్వాలని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుంభమేళాపై విపక్షాలకు కూడా భావాలు ఉన్నాయని.. రెండు నిమిషాలు మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలని ప్రియాంక కోరారు.
దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతమైందని ప్రధాని మోడీ అన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసగించారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళాతో దేశ ప్రజలను ఐక్యం చేసిందని చెప్పారు. అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోడీ స్పష్టం చేశారు.
PM Modi: తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరుతో పాటు క్రీడలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసే భారత్, పాక్ మ్యాచ్‌పై స్పందించిన మోడీ.. బెస్ట్ టీమ్‌ను ఫలితాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఇటీవల టీమిండియా జట్టు అద్భుత విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే, భారత్ – పాకిస్థాన్ జట్లలో ఏది ఉత్తమం? అనే ప్రశ్న ఎదురుకాగానే… ప్రధాని తనదైన…
PM Modi: ఆర్ఎస్ఎస్ ద్వారానే తనకు జీవిత లక్ష్యం గురించి తెలిసిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని ఆయన వివరించారు. ఆర్ఎస్ఎస్ వల్లే సేవ గొప్పతనం, దేశ స్పూర్తి పెరిగిందని వెల్లడించారు. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ తాను ఒక వ్యక్తిగా ఎదిగేందుకు కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
Lex Fridman: అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్, ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని వర్తమాన అంతర్జాతీయ పరిణామాలు, పాక్ అంశం, ఉక్రెయిన్ వార్, డొనాల్డ్ ట్రంప్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఈ ఇంటర్వ్యూ కోసం తాను 45 గంటల పాటు ‘‘ఉపవాసం’’లో ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్మాన్ చెప్పారు. ‘‘సరైన మనస్తత్వాన్ని పొందడానికి’’ దాదాపుగా 2 రోజలు ఉపవాసం ఉన్నానని చెప్పి ప్రధాని మోడీని ఆశ్చర్యపరిచారు.
PM Modi: అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రీడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని చర్చలు, దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలని మరోసారి పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ‘‘ఇది యుద్ధానికి సమయం కాదు’’ అని చెబుతూనే, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ‘‘యుద్ధభూమి విజయాలు శాశ్వత పరిష్కారానికి దారి తీయవు’’ అని సలహా ఇచ్చారు. Read Also: PM Modi: భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది.. కొనసాగుతున్న…