Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి దాడి చేస్తుందో అని పాకిస్తాన్ హడలి చేస్తోంది. బయటకు తన ప్రజల మెప్పు కోసం ఎన్నో బీరాలు పలుకుతున్నప్పటికీ, లోలోపల మాత్రం భయపడుతోంది. ఇప్పటికే, ఆర్థిక దరిద్రంలో పాకిస్తాన్ ఉంది. యుద్ధం చేస్తే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుందనేది అక్కడి ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. యుద్ధం చేయాల్సి వస్తే, మూడు రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు, ఒక వేళ యుద్ధం కోసం పాక్ బలగాలు ఇండియా సరిహద్దుల్లోకి వస్తే, బెలూచిస్తాన్‌లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్ల దాడులు తీవ్రమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ, దాని అధికారులు యుద్ధానికి, దాడులకు ముందే తమ పని చక్కబెట్టుకుంటున్నారు. ఇప్పటికే, పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ తన కుటుంబాన్ని యూకేకి తరలించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన అనేక మంది అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల్లో యూకే, న్యూజెర్సీలకు పంపారు.
Read Also: AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో 400 మెడికల్ ఆఫీసర్ జాబ్స్.. అర్హులు వీరే
యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం బయటకు చెబుతున్నప్పటికీ, భారత్ ప్రతీకార చర్యల్ని ఆపాలని పలు దేశాల సాయాన్ని కోరుతున్నారు. చివరకు, పాక్ ప్రధాని షహజాబ్ షరీఫ్ మాట్లాడుతూ.. పహల్గామ్ దాడికి సంబంధించి అంతర్జాతీయ విచారణకు పాకిస్తాన్ సహకరిస్తుందనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. చివరకు నిన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా తాము ఉగ్రవాదినికి మద్దతు ఇచ్చామని చెప్పుకోవడం గమనార్హం.
మరోవైపు, భారత్ సైన్యం ‘‘అటాక్’’ మోడ్‌లో సర్వం సిద్ధంగా ఉంది. అరేబియా సముద్రంలో INS సూరత్ యుద్ధనౌక నుండి క్షిపణి పరీక్షను నిర్వహించడం ద్వారా పాకిస్తాన్‌కి బలమైన సందేశం పంపింది. ఇక రాఫెల్, సుఖోయ్ యుద్ధవిమానాలు వార్ ఎక్సర్‌సైజ్ నిర్వహిస్తున్నాయి. భారత నావికాదళం విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను సముద్రంలో మోహరించింది. INS విక్రాంత్‌లో MiG-29K ఫైటర్ జెట్‌లు, అటాక్ హెలికాప్టర్‌లను మోహరించారు. ఈ నేపథ్యంలో, ఎప్పుడు ఏ విధంగా భారత్ దాడి చేస్తుందో అని పాక్ సైన్యం తెగ హైరానా పడిపోతోంది.