ప్రధాని మోడీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. మస్కట్‌లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది. స్నేహం అనే బలంపై ముందుకు సాగింది.
ఇథియోపియాలో ప్రధాని మోడీకి అరుదైన గౌరవం లభించింది. తొలిసారి ఇథియోపియాలో పర్యటించిన ప్రధాని మోడీకి ప్రత్యేక గౌరవాన్ని కనుపరిచారు. ఆద్యంతం ఇథియోపియా నేతలంతా ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా మోడీకి అపూర్వ గౌరవం లభించింది.
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటన సాంస్కృతిక ఆత్మీయతతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా నిలిచింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు అడిస్ అబాబాకు చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇథియోపియా కళాకారులు భారత జాతీయగీతం “వందేమాతరం”ను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. PM Modi: “వసుధైక కుటుంబానికి భారత్ కట్టుబడి ఉంది”.. ఇథియోపియా పార్లమెంట్లో…
ఎవరు? ఆ లీకు వీరులెవరు..? ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీల మీటింగ్ వివరాలను బయటికి చెప్పిందెవరు?.. దీని గురించి బయట ఎక్కడా చర్చ జరక్కూడదని స్వయంగా మోడీ చెప్పినా సరే.. లీక్ చేసింది ఎవరు? అనుమానపు చూపులు ఎటువైపు ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరుపై ఆరా తీశారు. ఇప్పటిదాకా…
Rahul Gandhi: ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మహాత్మాగాంధీ ఆదర్శాలకు అవమానమని అన్నారు.
అరబ్ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోర్డాన్‌కు చేరుకున్నారు. జోర్డాన్‌లోని అమ్మాన్లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ రాజు II అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్, ప్రధాని జాఫర్‌తో సమావేశం కానున్నారు. ప్రధాని…
కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ సభలో ప్రధాని మోడీని దూషించారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే అధికార పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.