ప్రధాని మోడీ.. బైసరన్ లోయలోకి వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరినీ కూడా వదిలి పెట్టమని హెచ్చరించారు. నిందితులను న్యాయస్థానం ముందు నిలబెడుతామని ప్రతిజ్ఞ చేశారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా, 12 మంది గాయపడినట్లు చెబుతున్నారు. అయితే, మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ దాడిని ప్రధాని నరేంద్రమోడీ సహా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. దాడికి పాల్పడినవారిని ఖచ్చితంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ…
Pahalgam terror attack: ఉగ్రవాదులు అదును చూసి ఘాతుకానికి పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టులను టార్గెట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ బాధితులు వీడియోలు అందరి చేత కన్నీరు తెప్పిస్తున్నాయి. ఎంతో ఆనందంగా ముగియాల్సిన ట్రిప్, ఉగ్రవాదుల మూలంగా అంతా తారుమారైంది.
శ్రీనగర్ కు బయలుదేరి వెళ్తున్నారు అమిత్ షా. కాగా, శ్రీనగర్ వెళ్లిన తర్వాత అన్ని ఏజెన్సీలతో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అమిత్ షా. కాగా, అంతకుముందు, పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంతీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన ఉగ్రవాద చర్యలో పాల్గొన్న వారిని వదిలిపెట్టబోము హెచ్చరించారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించింది.
Viral Video: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం సౌదీ అరేబియా పర్యటన కోసం బయలుదేరారు. రెండు రోజులు పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య మరింతగా సంబంధాలు బలపడేలా, పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, సౌదీ ప్రభుత్వం ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం పలికింది.
ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి జెడ్డాకు వెళ్లారు. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ సౌదీకి వెళ్తున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఏప్రిల్ 22, 23 తేదీల్లో మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో పర్యటిస్తున్నట్లు పేర్కొంది.