ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి షెడ్యూల్ ఖరారు ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 15 నిమిషాలు రోడ్డు షో, గంట పాటు సభ ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.
Also Read: SRH Playoffs: ఆర్సీబీలా మేం కూడా ప్లేఆఫ్స్‌కు చేరతాం.. నితీశ్ రెడ్డి కామెంట్స్ వైరల్!
ప్రధాని నరేంద్ర మోడీ మే 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర రోడ్డు షో ఉంటుంది. ఈ రోడ్డు షో 15 నిమిషాలపాటు సాగనుంది. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శన ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్‌లో ప్రధాని బయల్దేరి.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.20కి గన్నవరం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళతారు.